Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ రాకుండా...'కోవా పంజాబ్' మొబైల్ యాప్...

కోవా అంటే కరోనా వైరస్ హెచ్చరిక  అని అర్ధం.  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  కరోనావైరస్ నివారణ, సలహాలను పంచుకోవడం కోసం, అలాగే ప్రజల్లో అవగాహన మరింత కల్పించడానికి పంజాబ్‌ ప్రభుత్వం దీనిని అభివృద్ధి చేశారు.

'COVA Punjab' Mobile App Launched  by punjab government to bring awareness
Author
Hyderabad, First Published Mar 10, 2020, 5:01 PM IST

కోవా అంటే కరోనా వైరస్ హెచ్చరిక  అని అర్ధం.  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  కరోనావైరస్ నివారణ, సలహాలను పంచుకోవడం కోసం, అలాగే ప్రజల్లో అవగాహన మరింత కల్పించడానికి పంజాబ్‌ ప్రభుత్వం దీనిని అభివృద్ధి చేశారు.

కరోనావైరస్ (COVID-19) బారిన పడకుండా ఎలా ఉండాలో ప్రజలను చైతన్యపరిచెందుకు పంజాబ్ ప్రధాన కార్యదర్శి కరణ్ అవతార్ సింగ్ సోమవారం 'కోవా పంజాబ్' పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేశారు.

also read ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్... వాటికికోసం ఫ్రీ రిపేర్‌ సర్వీస్ ప్రోగ్రామ్‌...

కోవా అంటే కరోనా వైరస్ హెచ్చరిక  అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతో సంప్రదించి  దాని నివారణ, సలహాలను పంచుకోవడం ద్వారా అవగాహన మరింత కల్పించడానికి అభివృద్ధి చేశారు.

ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలిపే కరోనా వైరస్ లక్షణాలను, దాని గురించి సమాచారాన్ని, ప్రభుత్వ సలహాలను ప్రజలకు ఈ అప్లికేషన్ ద్వారా అందిస్తుంది అని సింగ్ చెప్పారు. ఒకవేళ ఎవరికైనా  కరోనా లక్షణాలు ఉంటే  వారికి సమీపంలో ఉన్న జిల్లా ఆసుపత్రి, నోడల్ అధికారి సంబంధించిన సమాచారాని సూచిస్తుంది.

అదనపు చీఫ్ సెక్రటరీ గవర్నెన్స్  విని మహాజన్ మాట్లాడుతూ ప్రజలు ఇంకా వారి కుటుంబ సభ్యులను  కరోనా వైరస్ (COVID-19) నుండి రక్షించుకోవటానికి , దాని బారిన పడకుండా ఉండేందుకు తెలుసుకోవలసిన సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది.

also read జియో మరో సరికొత్త రికార్డ్: సొంతంగా 5జీ టెక్నాలజీ నెట్‌వర్క్‌ ?

ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్‌స్టోర్‌లో "కోవా పంజాబ్" పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉందని ఆమె అన్నారు. ఈ యాప్ ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో ఉంచుకోవాలని ఆమె సూచించారు, తద్వారా వారికి వివిధ ప్రభుత్వ సలహాలపై త్వరగా సమాచారం పొందవచ్చు.

ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించే సమాచారం, సలహాలు, సూచనలు పంచుకుంటామని ఆరోగ్య ప్రధాన కార్యదర్శి అనురాగ్ అగర్వాల్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios