Asianet News TeluguAsianet News Telugu

జియో మరో సరికొత్త రికార్డ్: సొంతంగా 5జీ టెక్నాలజీ నెట్‌వర్క్‌ ?

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో సరికొత్త రికార్డు నెలకొల్పనున్నది. త్వరలో 5జీ టెక్నాలజీని సొంతంగా వినియోగంలోకి తీసుకురానున్నది. అదే జరిగితే ప్రపంచంలోనే థర్డ్ పార్టీతో సంబంధం లేకుండా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థగా రిలయన్స్ నిలవనున్నది.

Reliance Jio develops in-house 5G tech to reduce costs
Author
Hyderabad, First Published Mar 10, 2020, 10:35 AM IST

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వినియోగదారులకు అత్యుత్తమ ఆఫర్లతో సేవలతో అలరిస్తున్న రిలయన్స్‌ జియో త్వరలో 5జీ టెక్నాలజీతో మన ముందుకు రాబోతుంది. ధరల నియంత్రణ కోసం విదేశీ వెండర్లతో సంబంధం లేకుండా సొంత 5జీ నెట్‌వర్క్‌ను రూపకల్పన చేశామని కంపెనీ వర్గాలు తెలిపాయి. 

ప్రపంచ వ్యాప్తంగా తొలిసారిగా ఒక మొబైల్‌ కంపెనీ ధర్డ్‌ పార్టీతో సంబంధం లేకుండా జియో టెక్నాలజీ నిపుణులు సొంత 5జీ టెక్నాలజీని రూపకల్పన చేశారని తెలుస్తోంది. అధునాతన టెక్నాలజీ ద్వారా పారిశ్రామిక, డిజిటల్‌, వ్యవసాయ రంగాలలో 5జీ టెక్నాలజీ ద్వారా మరింత మెరుగైన సేవలందిస్తుందని జియో వర్గాలు పేర్కొంటున్నాయి. 

జియో తన 5జీ టెక్నాలజీ రూపకల్పనకు సొంత హార్డ్‌వేర్‌ను రూపొందించుకుందని కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు. నోకియా, ఒరాకిల్ సంస్థల 4జీ వాయిస్ టెక్నాలజీని ఇప్పటికే రిలయన్స్ జియో తన సొంత టెక్నాలజీతో రీప్లేస్ చేసేసిందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.

also read వినియోగదారుల మనసు దోచేస్తున్న ఒప్పో రెనో3 ప్రో

సొంతంగా క్లౌడ్ నేటివ్ ప్లాట్ ఫామ్ అభివ్రుద్ధి చేసుకున్నామని, 5జీలో పూర్తిగా రిలయన్స్ స్వావలంభన సాధించిందని ఆ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ఇండియాలో రిలయన్స్ 5జీ వాయిస్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి కూడా. 

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం హువావే మాదిరిగానే రిలయన్స్ జియో కూడా రూపొందించిన టెక్నాలజీని సెక్యూరిటీ, నిఘా డ్రోన్లు, ఇండస్ట్రీయల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వ్యవసాయ రంగ డిజిటలీకరణ తదితర రంగాలకు ఉపయోగించొచ్చు.

తన సొంత టెక్నాలజీతో 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతించాలని టెలికం శాఖను రిలయన్స్ కోరింది. ఈ మేరకు టెలికం శాఖకు సెపరేట్ ప్రెజెంటేషన్ కూడా జియో ఇచ్చింది. 

తమ టెక్నాలజీ వాణిజ్యంగా తమకు పూర్తిగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందని జియో ఎగ్జిక్యూటివ్ తెలిపారు. కానీ దీనిపై అధికారికంగా జియ మాత్రం స్పందించలేదు. ఇంతకుముందు జియో 5జీ ట్రయల్స్ ఎరిక్సన్, నోకియా, హువావే, శామ్ సంగ్ సంస్థలతో కలిసి నిర్వహించింది. 

also read సోనీ కంపెనీ నుండి కొత్త 4కె హ్యాండిక్యామ్‌ విడుదల...

మరోవైపు, రిలయన్స్ జియో తన దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.4,999 మళ్లీ తీసుకొచ్చింది. గతేడాది డిసెంబర్ నెలలో జియో ఈ ప్లాన్‌ను అటకెక్కించింది. ఈ ప్లాన్ కాల పరిమితి 360 రోజులు.

350 జీబీ డేటా, జియో నుంచి జియోకు అపరిమిత కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు 12 వేల నిమిషాలు లభిస్తాయి. జియోలో ఇప్పటికే రూ.1,299, రూ.2,121తో రెండు దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 

రూ.1,299 ప్లాన్‌ కాలపరిమితి 336 రోజులు. 24 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. గతంలో ఈ ప్లాన్‌ కాలపరిమితి 365 రోజులుగా ఉండేది. అయితే, గతనెలలో దీనిని 336 రోజులకు తగ్గించింది. ఇక, రూ.2,121 ప్రీపెయిడ్ కాలపరిమితి 336 రోజులు. రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios