Asianet News TeluguAsianet News Telugu

పన్నీర్ తింటే.. లావుగా మారడం ఖాయమా?

తక్కువ కొవ్వు ఉన్న పాలనుంచి చేసిన పనీర్‌లో మాంసకృత్తులు ఎక్కువ. పనీర్‌లో ఎముకల పటుత్వానికి అవసరమైన కాల్షియమ్‌, ఫాస్ఫరస్‌తో పాటు విటమిన్‌ బి- 12  పుష్కలంగా ఉంటుంది. 

Does Paneer (cheese) make you Fit or Fat?
Author
Hyderabad, First Published Jul 21, 2020, 3:11 PM IST

పన్నీర్... చాలా మందికి నచ్చే ఫుడ్ ఇది. కేవలం పాలతో మాత్రమే తయారయ్యే ఈ ఆహారాన్నిచాలా మంది ఇష్టపడతారు. దీనితో రుచికరమైన ఎన్నో వంటకాలు తయారుచేసుకోవచ్చు. పన్నీర్ స్త్రీలు ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు ఖచ్చితంగా తినాలని ఆహార నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 

30 తర్వాత శరీరంలో కాల్ఫియం శాతం తగ్గుతూ వస్తుంది. కాబట్టి దీని అవసరం చాలా ఉంది. అయితే.. చాలా మందిలో ఈ పనీరు విషయంలో అనుమానాలు ఉన్నాయి. పనీర్ తింటే లావుగా మారుతారనే భయంతో చాలా మంది దానిపై మక్కువ ఉన్నా దూరంగా పెట్టేస్తున్నారు. నిజంగానే పన్నీర్ తింటే లావు అవుతారా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

పనీర్‌ను పాల నుండి తయారు చేస్తారు. తయారు చేసిన పాలలో కొవ్వు శాతాన్ని బట్టి పనీర్‌లో ఎంత కొవ్వు ఉంటుందో తెలుస్తుంది. తక్కువ కొవ్వు ఉన్న పాలనుంచి చేసిన పనీర్‌లో మాంసకృత్తులు ఎక్కువ. పనీర్‌లో ఎముకల పటుత్వానికి అవసరమైన కాల్షియమ్‌, ఫాస్ఫరస్‌తో పాటు విటమిన్‌ బి- 12  పుష్కలంగా ఉంటుంది. 

మాంసకృత్తులు ఎక్కువగా ఉన్నా, కొంత పిండి పదార్థాలున్నప్పటికీ పనీర్‌ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. వంద గ్రాముల పనీర్‌లో సుమారుగా 250 నుండి 300 కెలోరీలు ఉంటాయి. 

కాబట్టి మోతాదుకు మించి తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫాస్ట్‌ ఫుడ్స్‌లో ఉండే నూనెలో వేయించిన పనీర్‌ వంటలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. పరిమిత మోతాదులో, అంటే రోజుకు 60 -70 గ్రాములకు మించకుండా పనీర్‌ తీసుకుని, రోజులో మిగతా ఆహారాన్ని కూడా కెలోరీ పరిధికి లోబడి తీసుకుంటే మంచిది. 

అధిక బరువు ఉన్నవారు కూడా పనీర్‌ తీసుకోవచ్చు. పానీర్లోని మాంసకృత్తుల వలన ఆకలి త్వరగా వేయదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఓ పూట పనీర్‌ తీసుకొంటే బరువు తగ్గేందుకూ ఉపయోగ పడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios