Asianet News TeluguAsianet News Telugu

ఈ కాంబినేషన్ ఫుడ్.. చాలా డేంజర్

కొన్ని ఆహార పదార్థాలకు పొత్తు కుదరదు. అలాంటి వాటిని కలిపి తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి.పుల్లని త్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం లాంటి సమస్య తలెత్తే అవకాశం ఉంది.

Dangerous Food Combinations To Avoid
Author
Hyderabad, First Published Feb 18, 2020, 2:49 PM IST

ముద్దపప్పు-ఆవకాయ, సాంబారు-చికెన్, పులిహోర- దద్దోజనం, బిర్యానీ- కూల్ డ్రింక్ ఇలా కొంతమంది రకరకాల ఫుడ్ కాంబినేషన్లు ఇష్టపడతారు. ఒక ఫుడ్ తినేటప్పుడు దాని కాంబినేషన్ తో కలిపి తినాలని ఫుడ్ ప్రియులు కోరుకుంటారు. వారికి నచ్చిన కాంబినేషన్ లో ఒకటి ఉండి.. మరొకటి లేకపోతే.. చాలా మందికి ముద్దకూడా దిగదు.

కొన్ని కాంబినేషన్లు వినడానికి, తినడానికి బాగుంటాయి. కానీ... అలా అన్ని రకాలను కలిపి తినేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఫుడ్స్ విడివిడిగా తినడం వల్ల ఎంత ప్రయోజనం కలిగించినా...కలిపి తింటే మాత్రం విషం కన్నా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అలాంటి ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కొన్ని ఆహార పదార్థాలకు పొత్తు కుదరదు. అలాంటి వాటిని కలిపి తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి.పుల్లని త్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం లాంటి సమస్య తలెత్తే అవకాశం ఉంది.

మాంసం, పాల ఉత్పత్తులు, చేపలు, వెన్న లేదా మీగడ కలిపి తినకూడదు. అలాగే పాలు, గుడ్లు కలిపి తినకూడదు. పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కూడా కలిపి ఒకేసారి తీసుకోకూడదు.

Also Read శృంగార సామర్థ్యాన్ని పెంచే మునగలో ఇంకెన్ని లాభాలో...

ఒకవేళ తీసుకుంటే జీర్ణకోశంలో వాయువులు తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పండ్లు ఖాళీ కడుపుతో మాత్రమే తినాలి. పండ్లు తిన్న రెండు గంటల తర్వతే వేరే ఆహారం తీసుకోవాలి.

అంతేకాకుండా... వేడి, చల్లని పదార్థాలు వెంటనే తీసుకోకూడదు. అంటే పెరుగు తినగానే కాఫీ తాగడం.. లేదా ఐస్ క్రీం తినగానే..వేడిగా టీ, కాఫీలు తాగడం లాంటివి చెయ్యకూడదు.అలాగే భోజనం చేసే సమయంలో చల్లని నీరూ తాగకూడదు. ఇలా చేస్తే జీర్ణాగ్ని చల్లారిపోయి జీర్ణక్రియ కుంటుపడుతుంది.

తేనెను ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి పదార్థాల్లో కలిపి తినకూడదు. టీలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటాం. కొందరు పాలలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇలా వేడి పదార్థాల్లో తేనెను కలిపినప్పుడు తేనెలో కలిసి ఉండే మైనం విషంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పద్ధతిని మానుకోవాలి.

Follow Us:
Download App:
  • android
  • ios