వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ తెలుగు న్యూస్ చానెల్స్ లో స్క్రోలింగ్ వస్తుంది ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ జైలు నుండి ఫోన్ రావడంతో... ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబై తరలి వెళ్తున్నారు అనే వార్త విస్తృతంగా ప్రసారమవుతుంది. ఈ వార్తలో నిజానిజాలు ఏమిటో ఒకసారి చూద్దాము. 

ఈ వార్తలో పూర్తి నిజం మాత్రం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. మొన్నటి వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందొ ఇప్పుడు కూడా అలానే ఉంది. ఆయన పొటాషియం, సోడియం లెవెల్స్ తక్కువగానే ఉన్నాయి. 

స్వయంగా ఈ విషయం వారవారం రావు మేనల్లుడు తెలిపారు. వరవరరావు మేనల్లుడు వేణు సోషల్ మీడియాలో వారవారం రావు పై వస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఆయన స్వయంగా ఈ విషయాన్నీ వెల్లడించారు. 

""వివి ఆరోగ్యం విషమం" "జైలు అధికారుల నుంచి కుటుంబానికి సమాచారం" "హుటాహుటిన ముంబాయి ప్రయాణమవుతున్న కుటుంబం" అంటూ ఒకరిని మించి ఒకరు తెలుగు టివి చానళ్లు స్క్రోలింగ్ లు ఇస్తున్నాయట. (నేను టివి చూడను. ఒక గంటకు పైగా ముప్పై నలబై మంది నాకు ఫోన్ చేసి ఆందోళన వెలిబుచ్చారు).


అవేవీ నిజం కాదు. వివి ఇవాళ ఉదయం 11.30కు అక్కయ్యతో ఫోన్ లో మాట్లాడారు. వారం కింద ఉన్న ఆరోగ్య స్థితిలోనే, బలహీనంగానే ఉన్నారు. సోడియం, పొటాషియం లెవల్స్ మళ్లీ పడిపోతున్నట్టున్నాయి. తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అవసరమైన స్థితిలోనే ఉన్నారు.

కాని "విషమం" అనే మాట నిజం కాదు. ఫోన్ వచ్చింది స్వయంగా ఆయన నుంచే, జైలు అధికారుల నుంచి కాదు. కుటుంబ సభ్యులం ఎవరమూ "హుటాహుటిన" కాదు గదా, మామూలుగా కూడ ముంబాయి వెళ్లడం లేదు. జైలు ములాఖాత్ లు లేవు గనుక వెళ్లినా వివి ని కలవనివ్వరు." అని వేణు తెలిపారు.