Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాక్ట్ చెక్: లక్ష శివలింగాల బయల్పడ్డాయంటూ గాలి వార్తలు... అసలు నిజం ఇది

కర్ణాటక రాష్ట్రం సిర్సి తాలుకాలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని ఓ నదిలోని బండరాళ్లపై పదులు... వందలు కాకుండా వేల సంఖ్యలో శివ లింగాలు చెక్కబడివున్నాయి

Fact Check: Mystery behind one lakh Shiva Lingas in a Karnataka river solved
Author
Bangalore, First Published Jul 29, 2020, 4:29 PM IST

కర్ణాటక రాష్ట్రం సిర్సి తాలుకాలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని ఓ నదిలోని బండరాళ్లపై పదులు... వందలు కాకుండా వేల సంఖ్యలో శివ లింగాలు చెక్కబడివున్నాయి. 2011లో పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో పర్యటించడంతో ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలిసింది.

అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ శివలింగాలకు సంబంధించి ఓ గాలి వార్త చక్కర్లు కొడుతోంది. ‘‘ దేశ చరిత్రలోనే తొలిసారిగా లక్ష శివలింగాలు ఒకే చోట కొలువుదీరిన పుణ్యక్షేత్రం బయటపడింది.

కర్ణాటకలోని శివకాశీ నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో ఈ లింగాలు దర్శనమిచ్చాయని ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన కొందరు ఈ విషయానికి సంబంధించిన అసలు వాస్తవాలను చెప్పారు.

ఇక్కడ దాదాపు 1000 శివలింగాలు మాత్రమే ఉన్నాయని.. సోషల్ మీడియాలో చెబుతున్నట్లుగా లక్షలింగాలు లేవని తేల్చి చెప్పారు. ఈ ప్రదేశం గురించి తొమ్మిదేళ్ల క్రితమే ప్రపంచానికి తెలిసిందని ఉత్తర కన్నడ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.

క్రీస్తు శకం 1,678- 1718 మధ్యకాలంలో సిర్సి రాజు అరసప్ప నాయక్ ఇక్కడ శివలింగాలను చెక్కించినట్లుగా అధికారులు తెలిపారు. నాటి నుంచి ప్రతియేటా శివరాత్రికి వేలాది మంది భక్తులు ఆ ప్రాంతానికి చేరుకుని శివయ్యను స్మరించుకుంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios