Asianet News TeluguAsianet News Telugu

యువకుడికి ఆసుపత్రి బెడ్ ఇచ్చి 85 సంవత్సరాల వృద్ధుడు మృతి, వాస్తవమెంత..?

ఆసుపత్రిలో యువకుడికి బెడ్ ఇచ్చి ఇంటికి వెళ్లి 85 సంవత్సరాల వృద్ధుడు మరణించాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో అసలు నిజమెంత..?

85 year old gives bed to younger, dies, Is it True..?
Author
Nagpur, First Published Apr 29, 2021, 2:16 PM IST

నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. నాగపూర్ కి చెందిన 85 సంవత్సరాల  నారాయణ అనే వృద్ధ కరోనా రోగి తన ఆసుపత్రి బెడ్ ని వేరే ఆక్సిజన్ శాతం పడిపోతున్న యువకుడికి ఇవ్వమని డాక్టర్లకు చెప్పి ఇంటికి వెళ్లి అక్కడ మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సైతం ఇదే విషయాన్నీ ట్వీట్ చేసారు.ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలంటే ఇలానే ఉంటారంటూ నారాయణ ధబాల్కర్ ఫోటోను ట్వీట్ చేసి ఆయన మూడు రోజుల్లో మరణించారని తెలిపారు. ఇలాంటి త్యాగమూర్తులు దేశానికి గర్వకారణం అని రాసుకొచ్చారు. 

కాకపోతే ఆసుపత్రి వర్గాల వాదన మాత్రం కుటుంబ సభ్యులు చెప్పే వాదనకు పూర్తి భిన్నంగా ఉందని లోక్ సత్త అనే మరాఠీ పేపర్ చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం కరోనరీ హార్ట్ ప్రాబ్లమ్ తోని ఆసుపత్రికి వచ్చారని, అప్పుడు ఆయన నడుచుకుంటూ వచ్చారని, 7.55 కాళ్ళ ఆక్సిజన్ తో సహా ఇతర ట్రీట్మెంట్ ని కూడా స్టార్ట్ చేశామని చెప్పారు. కానీ ఆయన ఆసుపత్రిలో ఉండలేనని, ఇంటికి వెళతానని తమ మాట వినకుండా వెళ్లినట్టు డాక్టర్ చెప్పారు. ఆ ఆసుపత్రిలో బెడ్స్ అందుబాటులోనే ఉన్నాయని, అక్కడ బెడ్స్ కొరత లేదని మరొకరు తెలిపారు. 

కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆసుపత్రిలో చాలామంది రోదనలు విని గుండె కరిగి తనను ఇంటికి తీసుకెళ్లామని, తన బెడ్ వేరే ఏ యువకుడికైనా ఉపయోగపడుతుందని చెప్పారని అంటున్నారు. ఆయన త్యాగం నుండి తాము ఎటువంటి లాభం పొందదల్చుకోలేదని, కానీ ఆయన త్యాగం సమాజానికి ఆదర్శమని ఆయన కుమార్తె అన్నారని సదరు వార్తాపత్రిక వారి కుటుంబ సభ్యుల వెర్షన్ ని కూడా వేశారు. 

మేయర్ దయాశంకర్ తివారి ఈ విషయం పై స్పందిస్తూ ఈ విషయంలో విచారణ చేపడతామని, ఆసుపత్రి నుండి ఆయనను అసలు ఇంటికి ఎలా పంపించారని విషయంలో డాక్టర్ల నుండి సమాచారం సేకరిస్తామని తెలిపారు. 

ఈ విషయంలో ఎవరి వాదన కరెక్ట్, ఇందులోని నిజమెంతా అనే విషయంపై పూతి క్లారిటీ రాకున్నప్పటికీ... డాక్టర్లు మాత్రం తమతో రోగి ఈ విషయం చెప్పలేదని తెలిపినట్టు సదరు పత్రిక రాసింది. ఏది ఏమైనా కరోనా వైరస్ మాత్రం విలయతాండవం చేస్తుందనేది అక్షర సత్యం. 

Follow Us:
Download App:
  • android
  • ios