ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీదేవి నటించిన చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె చివరగా నటించిన చిత్రం జీరో. ముందుగా ఈ విషయం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కేవలం ఒక సాంగ్ లో స్పెషల్ గా వచ్చి వెళుతుందని తెలిసింది. 

ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ మరగుజ్జు పాత్రలో కనిపించనున్నాడు. టీజర్ కి అలాగే ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. కత్రినా కైఫ్ అనుష్క శర్మ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రీదేవి ఒక పాటలో షారుక్ తో కలిసి స్టెప్పులేయనుందని సమాచారం. ఈ విషయం గురించి జీరో చిత్ర యూనిట్ సభ్యులు ఎవరు స్పందించడం లేదు. 

అయితే అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఆమెకు సంబందించిన లుక్స్ ని కూడా బయటపెట్టడం లేదట. శ్రీదేవి మరణం కంటే ముందే ఈ తరహా ప్లాన్ ను సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పై గౌరి ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఆనంద్ ఎల్ రాయ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.