Asianet News TeluguAsianet News Telugu

‘బంగార్రాజు’ పెట్టుబడి మొత్తం 'జీ' దే...నాగ్ అదిరిపోయే స్ట్రాటజీ

 సోగ్గాడే చిన్ని నాయ‌నకు సీక్వెల్‌గా బంగార్రాజు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ మ‌ల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌ సెట్స్పైకి వచ్చింది. హైద‌రాబాద్‌లో బంగార్రాజు రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. 

Zee Studios funding Nagarjuna Bangarraju!
Author
Hyderabad, First Published Aug 26, 2021, 7:35 AM IST


‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం నాగార్జున కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రం రాబోతోంది. ఇందులో నాగ్ తో పాటుగా ఆయన పెద్ద కుమారుడు నాగ చైతన్య కూడా కనిపించనున్నారు. రీసెంట్ గా ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అయితే ఇక్కడో నిర్మాణపరమైన విశేషం ఉంది. 

జీ స్టూడియోస్ వారు ఈ సినిమాకు పూర్తి గా ఫండింగ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎమౌంట్ ని షెడ్యూల్ వారీగా రిలీజ్ చేయటానికి  రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. అందు నిమిత్తం ఈ సినిమాకు సంభందించిన శాటిలైటట్, డిజిటల్, థియోటర్ రైట్స్ మొత్తం వాళ్ల దగ్గరే ఉంటాయి. జీ స్టూడియోస్ వారు డిజిటెల్,శాటిలైట్ రైట్స్ తమ దగ్గరే పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని అమ్మేస్తారు. ఓ రకంగా నిర్మతగా జీ స్టూడియోస్ వ్యవహించనుంది. ఇంతకుముందు జీ స్టూడియోస్ వారు సినిమా పూర్తయ్యాక అన్ని రకాల రైట్స్ ని ఏకమొత్తంగా కొనుగోలు చేసి బిజినెస్ చేసింది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో లాభాలు ఆర్జించింది. దాంతో ఇలా టోకుగా రైట్స్ తీసుకోవటం మొదలెట్టింది.
 
ఇక బంగార్రాజు విషయానికి వస్తే..ఈసారి తండ్రి-కొడుకు ద్వయం తమదైన స్టైల్ లో అలరించడానికి వస్తున్నారని చెప్పడానికి సింబాలిక్ గా రెండు బైక్స్‌ని ఈ పోస్టర్‌లో చూపించారు. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ.. చైతన్యకు జోడీగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై నాగార్జున అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తోన్న నాగార్జున త్వరలో బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటాడు. అయితే ఈలోగానే నాగార్జున ఈ సినిమాను మొదలుపెట్టాడు. సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు చిత్ర షూటింగ్ ను ఈరోజు నుండి మొదలుపెట్టారు.  నాగార్జున అనేక సార్లు స్క్రిప్ట్ కు సంబంధించి మార్పులను సూచించడంతో లేటు అయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో షూటింగ్ చేస్తారు. స్వర్గం, నరకం, ఒక ఇల్లు సెట్స్ ను ఒకే ఫ్లోర్ లో నిర్మించారు.

బంగార్రాజు షూటింగ్ ఎక్కువ భాగం ఇక్కడే జరుగుతుంది. ఈ చిత్రంలో ఇంకా రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios