మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రం ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతుందా లేదా అనే డైలామో చాలా కాలం నుంచి కొనసాగుతోంది. అయితే థియోటర్స్ కు ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచీ  ఓటీటికు వద్దు..థియోటరే ముద్దు అని నినాదం ఫాలో అవుదామనుకున్నారు. అయితే అనుకున్నట్లుగా పరిస్దితులు లేవు. ఇప్పటికీ థియోటర్స్ విషయమై ఏమీ తేలలేదు. ఎప్పుడు రిలీజ్ లు ఉంటాయో తెలియటం లేదు. ఈ సినిమా ఇప్పటికే  సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాని ఇంకా ఆలస్యం చేయటం కన్నా ఓటీటికే ఇచ్చేయటం బెస్ట్ అని ఫిక్స్ అయ్యారట. జీ5 కు ఓటీటి రైట్స్ ఇచ్చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం భారీ మొత్తమే వెచ్చించారంటున్నారు. 

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 34 కోట్ల రూపాయలు సాలీడ్ డీల్ కుదురిందని అంటున్నారు. సూపర్ హిట్ అయితే కానీ ఈ కరోనా టైమ్ ఆ మొత్తం రాదని భావించి, డీల్ కు ఓకే చెప్పాసేరాని  తెలుస్తోంది. అయితే ఇదే సినిమాతో పాటు, నిత్యామీనన్ కీలకపాత్రలో ఇదే నిర్మాతలు లండన్ నేపథ్యంలో నిర్మించిన ఓ చిన్న సినిమాకు కూడా ప్యాకేజ్ గా వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డీల్ ఆల్ మోస్ట్ ఫైనల్ నే కానీ, రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదని అంటున్నారు.
 
 ఇక ఓటీటి సంస్దవారు" పే పర్ వ్యూ" పద్ధతిలో సినిమాని అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది.  ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుంది. పండగ చేసుకో లాంటి సినిమా తరవాత సాయి తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.