సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం బిజీగా గడుపుతోంది. తాజాగా నటి సమంత 'మహర్షి' టీమ్ కి విషెస్ చెబుతూ ఓ వీడియో విడుదల చేసింది.

అందులో మహేష్ ని పొగుడుతూ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పుకొచ్చింది. పూజా హెగ్డే, మిగిలిన చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ వీడియో బైట్ పంపించినందుకు మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా సమంతకు ధన్యవాదాలు చెప్పారు.

ఈ మేరకు సమంత వీడియోను షేర్ చేస్తూ.. ''సామ్ నువ్వంటే మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. సితార మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. 'మహర్షి'కి శుభాకాంక్షలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు'' అంటూ రాసుకొచ్చింది.