తాజాగా ఓ యువకుడు ఏఎల్ విజయ్ కారుపై దడి చేసిన సంఘటన అందరిని షాక్ కి గురిచేసింది. సదరు యువకుడిపై విజయ్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డైరెక్టర్ ఏఎల్ విజయ్ గురించి పరిచయం అక్కర్లేదు. తమిళంలో పలు చిత్రాలతో క్రేజీ దర్శకుడిగా విజయ్ గుర్తింపు పొందారు. ఆ తర్వాత క్రేజీ బ్యూటీ అమలాపాల్ తో వివాహం, విడాకుల గురించి తెలిసిందే. మద్రాసు పట్టణం, తలైవి , అభినేత్రి లాంటి చిత్రాలతో విజయ్ పాపులర్ అయ్యారు.
తాజాగా ఓ యువకుడు ఏఎల్ విజయ్ కారుపై దడి చేసిన సంఘటన అందరిని షాక్ కి గురిచేసింది. సదరు యువకుడిపై విజయ్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియాతో జరిగిన సంఘటనని వివరించారు. విజయ్ మాట్లాడుతూ.. తన కారులో మ్యానేజర్ మణివర్మ,అసిస్టెంట్ డైరెక్టర్స్ తో కలసి టి నగర్ హబీబుల్లా రాడ్ లో ప్రయాణిస్తుండగా ఓ యువకుడు సడెన్ గా కారుపైకి దూసుకువచ్చాడు.
తన కారుకి అడ్డం రావడమే కాక తమతో వాగ్వాదానికి దిగినట్లు విజయ్ తెలిపారు. తన హెల్మెట్ తో కారుని పలుమార్లు కొట్టాడట. అంతటితో ఆగకుండా విజయ్ పై కూడా దాడికి ప్రయ్నటించాడట. ఈ క్రమంలో విజయ్ మేనేజర్ మణివర్మ స్వల్పంగా గాయపడ్డట్లు తెలుస్తోంది.
దీనితో విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అరంబాకం కి చెందిన ఐజాక్ అనే పేరుగల యువకుడిగా గుర్తించారు. ఆ యువకుడు మద్యం సేవించినట్లు పోలీసులు పేర్కొన్నారు.మద్యం మత్తులో విజయ్ పై దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్.. అరుణ్ విజయ్, అమీ జాక్సన్ లతో మిషన్ చాప్టర్ 1 అనే యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
2014లో ఏఎల్ విజయ్ హీరోయిన్ అమలా పాల్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండేళ్లకే ఈ జంట విడిపోయారు. అనంతరం విజయ్ మరో యువతిని వివాహం చేసుకుని సెటిల్ అయిన సంగతి తెలిసిందే.
Also Read:నందిని రాయ్ పై ట్రోలింగ్.. ఇలా చేస్తుందని ఎవ్వరూ ఊహించరు, వైరల్
