హ్యాపినింగ్ హీరో విజయ్ దేవరకొండ నిన్న హాస్పటిల్ లో ఎడ్మిట్ అయ్యారని  తెలుస్తోంది.  ‘హోలీ’ సంబరాలు జరుపుకున్న తర్వాత విజయ్ హఠాత్తుగా కొద్దిగా నీరసంగానూ,  ఫీవరిష్ గా  అనిపించటంతో సిటీలో ని లీడింగ్ హాస్పటిల్ లో చేరారంటున్నారు. అయితే అది కేవలం వరస పెట్టి చేస్తున్న ప్రాజెక్టుల నుంచి వచ్చిన ఒత్తిడితో వచ్చిన సమస్యే అని డాక్టర్లు తేల్చారట. రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారట.

షెడ్యూల్ కు షెడ్యూల్ కు మధ్య గ్యాప్ తీసుకుంటే అంత ఒత్తిడి ఉండదని అన్నారట.  ఓ ప్రక్కన డియర్ కామ్రేడ్ చిత్రం, మరో ప్రక్క క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం, పైన ఎండలు ఈ పరిస్దితిని విజయ్ కు తెచ్చాయట.

ఇక ఈ సంఘటన బయిటకు పొక్కటంతో విజయ్ కి ఏమైంది అంటూ అభిమానులలో టెన్షన్ స్టార్టైంది.  దానికి తోడు దీన్ని పెద్దది చేయటం ఎందుకు అన్నట్లుగా  విజయ్ పిఆర్ టీమ్  సైలెంట్ అయ్యారు. దాంతో ఫ్యాన్స్ ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చలు మొదలెట్టారు.  

ప్రస్తుతం విజయ్  నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీ షూటింగ్ ఫైనల్ దశకు చేరుకున్న నేపధ్యంలో  ఈ రెస్ట్ తో ఈమూవీ షూటింగ్ కు సంబంధించి మరింత ఆలస్యం జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయమంలో ఈ వార్త  వైరల్ గా మారడంతో ఈ విషయమై ఈరోజు విజయ్ వైపు నుండి ఒక క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది అని తెలుస్తోంది.