బాలకృష్ణ-బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ మూవీపై ఫ్యాన్స్ తో పాటు చిత్ర వర్గాలలో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి. దీనితో మూడో చిత్రం అంతకు మించి ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. బాలయ్య బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో మంచి ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా పంచె కట్టులో బాలయ్య లుక్ కేకగా ఉంది. 

కాగా ఈ చిత్ర హీరోయిన్ పై అనేక రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. మొదటగా మలయాళ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ ని తీసుకున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఆ తరువాత సీమ టపాకాయ్ ఫేమ్ పూర్ణను తీసుకున్నారని కూడా వార్తలు రావడం జరిగింది. బాలయ్య సరసన ఫేడ్ అవుట్ అయిన పూర్ణను అనుకోవడంపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. 

బాలయ్యకు హీరోయిన్ దొరకడం లేదని ప్రచారం జరుగుతుండగా, యంగ్ బ్యూటీ సయేశాను ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇక సయేశా అక్కినేని హీరో అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు. గత ఏడాది విడుదలైన కప్పన్ మూవీలో కూడా సయేశా నటించడం జరిగింది. 2019లో సయేశా తనకంటే 16ఏళ్ళు పెద్దవాడైన ఆర్యను ప్రేమ వివాహం చేసుకున్నారు.