నేచురల్ స్టార్ నాని వరుసగా కథలను ఓకే చేస్తూ సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవల 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో త్వరలోనే 'గ్యాంగ్ లీడర్' సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనున్నాడు. ఆగస్ట్ 30న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

మిగిలిన హీరోలతో పోలిస్తే నాని ఏడాదికి రెండు,మూడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ విషయంపై టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోల బ్యాచ్ ఏమనుకుంటుందో తెలుసా..? రీసెంట్ గా ఓ నైట్ పార్టీలో కలిసిన కొంతమంది హీరోల బ్యాచ్.. నాని గురించి చర్చించుకున్నారట. 

అసలు నాని లైఫ్ మాకొద్దు బాబోయ్.. మేం ఏడాదికి ఒక్క సినిమానే చేస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారట. దానికి కారణంగా నాని ఒక సినిమా చేసిన తరువాత బ్రేక్ తీసుకోడు. వెంటనే మరో సినిమా సెట్స్ పైకి వెళ్తాడు. 

కానీ మిగిలిన హీరోలు అలా కాదు.. సినిమా పూర్తైన వెంటనే రిలాక్స్ అవ్వడానికి ఫారెన్ ట్రిప్ లకు వెళ్తుంటారు. నానిలా ఏడాదికి రెండు, మూడు సినిమాలంటే ఈ ట్రిప్ లన్నీ కట్ అయిపోతాయని వారి భయమట. అయితే నాని సన్నిహితులు మాత్రం అతడు కూడా ఎంజాయ్ చేస్తుంటాడని, సినిమాలతో పాటు ట్రిప్ లను కూడా మ్యానేజ్ చేస్తుంటాడని చెబుతున్నారు.