పెద్ద హీరోల సంక్రాంతి పోరులో సైలెంట్ గా జాయిన్ అయ్యాడు సంతోష్ శోభన్. ఆయన లేటెస్ట్ మూవీ కళ్యాణం కమనీయం సైతం తెలుగు పండుగకు విడుదలవుతుంది.  

సంక్రాంతి పోరు చాలా రసవత్తరంగా ఉంది. రోజుకో చిత్రం చొప్పున విడుదల కానున్నాయి. కోలీవుడ్ స్టార్స్ డబ్బింగ్ చిత్రాలు వారసుడు, తెగింపు జనవరి 11న విడుదలవుతున్నాయి. వారసుడు నిర్మాతగా ఉన్న దిల్ రాజు మొదట జనవరి 12 విడుదల తేదీగా ప్రకటించారు. కారణం తెలియదు కానీ ఓ రోజు చిత్రాన్ని ప్రీఫోన్ చేశాడు. ఈ క్రమంలో అజిత్-విజయ్ ఒకే రోజు బాక్సాఫీసు బరిలో దిగనున్నారు. ఆ నెక్స్ట్ డే 12న వీరసింహారెడ్డి విడుదలవుతుంది. ఇక జనవరి 13న వాల్తేరు వీరయ్యగా చిరు రంగంలో దిగుతున్నారు. 

రెండు నెలలుగా సంక్రాంతి చిత్రాల థియేటర్స్ విషయంలో వివాదం నడుస్తుంది. దిల్ రాజు వారసుడు చిత్రానికి అధిక మొత్తంలో థియేటర్లు లాక్ చేశారన్న ఆరోపణలు వినిపించాయి. ప్రచారమైనట్లే తెలుగు రాష్ట్రాల్లో సగం థియేటర్స్ వారసుడికి సగం చిరంజీవి, బాలయ్యలకు దక్కాయి. వైజాగ్ సిటీలో అధిక రెవెన్యూ ఇచ్చే మేజర్ థియేటర్స్ మెలోడీ, సంగం వారసుడు చిత్రం దక్కించుకుంది. జగదాంబ, శరత్ వాల్తేరు వీరయ్యకు దక్కాయి. లీలామహల్ మాత్రం వీరసింహారెడ్డికి ఇచ్చారు. మొత్తంగా 8 స్క్రీన్స్ వారసుడుకి 5 వాల్తేరు వీరయ్యకు 4 వీరసింహారెడ్డికి దక్కాయి. 

ఏపీ/తెలంగాణాలలో ఇదే రేషియోలో థియేటర్స్ పంపకం జరిగినట్లు సమాచారం. కాగా దిగ్గజాల పోరులో నేనూ ఉన్నానంటూ యంగ్ హీరో సంతోష్ శోభన్ ముందుకు వచ్చాడు. ఆయన లేటెస్ట్ మూవీ కళ్యాణం కమనీయం జనవరి 14న విడుదల చేస్తున్నారు. అంటే సంక్రాంతి చిత్రాల్లో చివరిగా కళ్యాణం కమనీయం విడుదల కానుంది. ఈ చిత్ర విడుదల వెనుక దిల్ రాజు హస్తం ఉందన్న ఆరోపణ వినిపించింది. 

YouTube video player

వారసుడు మూవీ అటూ ఇటూ అయితే ఆ మూవీ విడుదల చేసిన థియేటర్స్ లో చాలా వరకు కళ్యాణం కమనీయం చిత్రానికి కేటాయిస్తాడట. ఆ విధంగా వారసుడు థియేటర్స్ చిరంజీవి, బాలకృష్ణల చిత్రాలకు దక్కకుండా చేయాలని దిల్ రాజు ప్లాన్ అంటున్నారు. అలా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల కలెక్షన్స్ దెబ్బతీయాలని చూస్తున్నారట. 

విషయం ఏదైనా కళ్యాణం కమనీయం థియేటర్స్ లో దిగడం ఖాయమైపోయింది. దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించాడు. ఉద్యోగం లేకుండా పేరెంట్స్ పై పెళ్లయ్యాక భార్యపై ఆధారపడి బ్రతికేసే కుర్రాడి కథే కళ్యాణం కమనీయం చిత్రం అని, ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్ర ట్రైలర్ నీ అనుష్క రిలీజ్ చేయడం విశేషం. యూవీ క్రియేషన్స్ నిర్మించగా... ప్రియాంక భవాని శంకర్ హీరోయిన్ గా నటించారు.