సంగీతం ప్రపంచంలో దశాబ్దాలు పాటు సాగిన ఘన చిత్ర ఎస్పీ బాలు గారిది. దేశంలోని అన్ని భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడిన ఘనత ఆయన సొంతం. ప్రపంచంలో ఏ గాయకుడు పాడనన్ని పాటలు ఆయన ఆలపించారు. సినిమా పాటకు చిరునామా ఎస్పీ బాలు. 90వ దశకంలోనే దేశవిదేశాలలో తన ట్రూప్ తో ప్రదర్శనలు ఇచ్చేవారు బాల సుబ్రహ్మణ్యం. 


మహామహులు కలిగిన బాలు మ్యూజిక్ ట్రూప్ లో ఓ టీనేజర్ డ్రమ్స్ ప్లే చేసేవాడు. అతడు ఎవరో కాదు ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా సంగీత ప్రియులకు అద్భుత సాంగ్స్ అందిస్తున్న ఎస్ ఎస్ థమన్. చాలా చిన్న ప్రాయం నుండే థమన్ డ్రమ్స్ వాయించడంలో దిట్ట. అలా బాలు గారి టీమ్ లోని సభ్యునిగా అనేక ప్రదర్శనలలో థమన్ పాలుపంచుకున్నారు. 


నిన్న ఎస్పీ బాలు జయంతి పురస్కరించుకొని ఓ అరుదైన ఫోటో షేర్ చేశాడు థమన్. 1996లో బాలుతో తాను దిగిన ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. లాస్ ఏంజెల్స్ లో ప్రదర్శన కోసం వెళుతూ సియోల్ ఎయిర్ పోర్ట్ దిగిన సమయంలో బాలు, థమన్ సరదాగా ముచ్చటించుకుంటున్న సమయంలో తీసిన ఫోటో అది. షార్ట్ వేసుకొని నూనూగు మీసాలు కూడా లేని థమన్ భలే క్యూట్ గా ఉన్నాడు.