బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా యావర్.. బతిమాలుకున్నా అమర్ దీప్ హార్ట్ బ్రేక్ చేసిన తేజ

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ 41లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యావర్ బిగ్ బాస్ సీజన్ 7 కొత్త కెప్టెన్ గా అవతరించాడు.

Yavar became new captain in Bigg Boss Telugu7 dtr

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ 41లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యావర్ బిగ్ బాస్ సీజన్ 7 కొత్త కెప్టెన్ గా అవతరించాడు. అనేక ఆసక్తికర పరిణామాల మధ్య యావర్ కి ఈ అవకాశం దక్కింది. 

నేటి ఎపిసోడ్ కిచెన్ లో గొడవతో మొదలయింది. ఫుడ్ సరిపోవడం లేదని ప్రియాంక, యావర్ మధ్య వాగ్వాదం సాగింది. దీనితో ప్రియాంక తానూ కిచెన్ లో ఇంత కష్టపడుతున్నప్పటికీ ఇలాంటి మాటలు, అవమానాలు తప్పడం లేదని కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. 

అనంతరం బిగ్ బాస్ ఆటగాళ్లు పోటుగాళ్ళు మధ్య గేమ్స్ కొనసాగించారు. గోల్ వేసే టాస్క్ లో ఇరు టీమ్స్ నుంచి నలుగురేసి సభ్యులు పాల్గొన్నారు. ఈ గోల్ ఫైట్ ఇరు టీమ్స్ మధ్య భీకర పోరు జరిగింది. ఇటువైపు యావర్, అటువైపు అర్జున్ ఇద్దరూ చెమటలు చిందించారు. 

చివరకి ఆటగాళ్లు విజయం సాధించారు. ఎక్కువ గేమ్స్ లో ఆటగాళ్లు విజయం సాధించారు కాబట్టి కెప్టెన్సీ అవకాశం వారికే దక్కుతుంది అని బిగ్ బాస్ ప్రకటించారు. దీనితో కెప్టెన్సీ కోసం ఆటగాళ్లు పోటీ పడ్డారు. అయితే కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ఆటగాళ్లందరికి బెలూన్స్ కట్టారు. 

పోటుగాళ్ళు టీమ్ లో ఒక్కో సభ్యుడు బజర్ మోగిన తర్వాత సూదిని కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న వారిలో వారికి ఇష్టమైన వారికి ఇవ్వాలి. అలా సూది అందుకున్న సభ్యులు మిగిలిన వారిలో కెప్టెన్సీ అర్హత ఎవరికీ లేదు అని భావిస్తారో వారి బెలూన్ ని గుచ్చాలి. ఆట సందీప్.. ప్రశాంత్ బెలూన్ ని గుచ్చారు. కెప్టెన్ గా ప్రశాంత్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అనే రీజర్ చెప్పాడు. దీనితో ప్రశాంత్.. సందీప్ తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. 

ఇక అర్జున్.. సూదిని తేజ చేతికి ఇచ్చాడు. ఆ సమయంలో యావర్, అమర్ దీప్ ఉన్నారు. అమర్ దీప్ కొంచెం ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అంటూ బతిమాలుకున్నాడు. కానీ తేజ ఊహించని విధంగా అమర్ దీప్ బెలూన్ ని పగలగొట్టారు. దీనితో అమర్ దీప్ తనకి ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది అంటూ లబోదిబో మన్నాడు. 

చివరకి రేసులో మిగిలింది తేజ, యావర్ మాత్రమే. ఆ సమయంలో బిగ్ బాస్ ఆసక్తికర ప్రకటన చేశారు. నెక్స్ట్ బజర్ మోగినప్పుడు పోటుగాళ్ళు టీంలో ఒకరు సూదిని దక్కించుకోవాలి. సూది దక్కించుకున్నవారు ఇంకెవరితో డిస్కస్ చేయకుండా ఒకరి బెలూన్ పగలగొట్టి ఇంకొకరిని కెప్టెన్ చేయాలి అని ప్రకటించారు. బజర్ మోగగానే నయని పావని సూది దక్కించుకుంది. వెంటనే వెళ్లి తేజ బెలూన్ గుచ్చింది. దీనితో యావర్ బిగ్ బాస్ సీజన్ 7 కొత్త కెప్టెన్ గా అవతరించాడు. దీనితో ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జిని యావర్ కి అందించాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios