వైఎస్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా గత వారం రిలీజైన సంగతికి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన లెటస్ట్ కలెక్షన్స్ విషయానికి వస్తే. ఈ పొలిటికల్ డ్రామా అనుకున్నంతగా లాభాలను అయితే అందించలేదు. యూఎస్ లో అయితే కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి. 

అక్కడ 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఫస్ట్ వీక్ అయ్యే సరికి కనీసం కోటి రూపాయలను కూడా వెనక్కి తేలేదు. వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి స్టార్ డమ్ కూడా సినిమాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 7.6కోట్ల షేర్స్ ను అందించినట్లు తెలుస్తోంది. సినిమా 12 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. 

అంటే ఇంకా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ మరోసారి రాబట్టాలి. ఇంకో 7 కోట్లు వస్తే అప్పుడూ బయ్యర్స్, నిర్మాత సేఫ్ జోన్ లో పడినట్లు. కానీ సినిమా ఓపెనింగ్స్ ఈ రేంజ్ లో ఉంటే మిగతా రోజుల్లో ఆ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం సాధ్యమేనా అనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ వీక్ పెద్దగా పోటీని ఇచ్చే సినిమాలు అయితే లేవు. మరి యాత్ర సినిమా ఎంతవరకు రాబడుతుందో చూడాలి.    

మన టాలీవుడ్ హీరోల హైట్ లిస్ట్