కేజిఎఫ్ చిత్రంతో స్టైలిష్ హీరో యష్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. స్టార్ హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని యష్ లో కనిపిస్తున్నాయి. కేజిఎఫ్ చిత్రంలో యష్ చేసిన బీభత్సానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 2 సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగా యష్ మాత్రమే కాదు.. అతడి ముద్దుల కుమార్తె యషిక  కూడా అభిమానుల హృదయాలు దోచుకుంటోంది. 

గత ఏడాది యష్, రాధికపండిట్ దంపతులకు కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాధికా పండిట్ తన కుమార్తె ఫోటోలని అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవల్ యషికకు 6 నెలలు పూర్తయిన సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ముద్దులొలికే చిన్నారి యషిక వీడియో అభిమానుల హృదయాలు దోచుకునే విధంగా ఉంది. 

యషిక పుట్టిన మూడు నెలల నుంచి ఈ వీడియో షూట్ చేస్తున్నట్లు రాధికా పండిట్ తెలిపింది. అభిమానులు ఈ వీడియో చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతూ, షేర్ చేస్తున్నారు. యష్ తో పాటు అతడి కుమార్తె కూడా ఇంటర్నెట్ లో సెన్సేషనల్ గా మారుతోంది.