కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్  ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2)మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది.

కేజీఎఫ్ 2 హీరో యష్ కు పెద్ద సమస్యే వచ్చి పడింది. గతంలో ఏ కన్నడ హీరో ఇలాంటి సమస్య ఎదుర్కొని ఉండరు. దాంతో యష్ సైతం చాలా కన్ఫూజ్ గా ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఏమిటా సమస్య..అంత పెద్దదా?

డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఏంటో.. భాక్సాపిస్ దగ్గర దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఆ ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయింది. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు.

ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2)మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఇక రెండో రోజు,మూడో రోజు కూడా సెన్సేషనల్ కలెక్షన్స్‌ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఈ నేపధ్యంలో యష్ తర్వాత సినిమా ఏం చేయాలనేది పెద్ద సమస్యగా మారినట్లు సమాచారం.

అభిమానులు యష్ యాంగ్రీ మ్యాన్ లుక్ ని ఇష్టపడుతున్నారు మరియు యష్ మార్కెట్ ఇప్పుడు KGF 2 కి పెరిగింది. అయితే యష్‌కి అతని నెక్ట్స్ చిత్రం పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే KGF 2 వంటి చిత్రం తర్వాత అంచనాలు భారీగా ఉంటాయి. కాబట్టి అతను ఎవరితో ముందుకు వెళ్లబోతున్నాడు అనేది తదుపరి ప్రశ్న. ప్రస్తుతం సౌత్ డైరెక్టర్లలో చాలా మందిని టాప్ స్టార్ హీరోలు బ్లాక్ చేసుకున్నారు. దీంతో యష్‌కి కన్నడలో దర్శకుడిని వెతకడం తప్ప మరో మార్గం కనపడటం లేదు.

కానీ అదే భారీ కాన్వాస్‌ని కొనసాగించి, పెద్ద సినిమా తీయడం కన్నడ దర్శకులకు మామూలు విషయం కాదు. అయితే ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్‌లో ఉన్న చరణ్ మరియు ఎన్టీఆర్‌లకు, వారికి దర్శకత్వం వహించడానికి మంచి దర్శకులు వరుసలో ఉన్నందున పెద్దగా ఇబ్బంది లేదు. వీటన్నింటిని చూస్తే, యష్‌కి KGF2 తర్వాత పాన్ ఇండియా చిత్రంతో రావడానికి నిజమైన ఛాలెంజ్ ఉందని మరియు అది డైరక్టర్ ని ఎన్నుకోవడంతో ప్రారంభమవుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. మరి దీనికి పరిష్కారం యష్ ..ఏ డైరక్టర్ రూపంలో ఎంచుకుంటాడు అనేది వేచి చూడాల్సిన విషయం.