Asianet News Telugu

“కేజీయఫ్ 2″ కిక్కిచ్చే రెండు క్రేజీ అప్డేట్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం కేజీఎఫ్ 2 తెరకెక్కుతోంది. 

yash Kgf 2 audio rights sold to lahari music jsp
Author
Hyderabad, First Published Jul 2, 2021, 3:02 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


ఎప్పుడు విడుదల అవుతుందా అని ఈ సంవత్సరం ఎదురుచూసే చిత్రాల్లో మొదట వరసలో నిలబడేది “కేజీయఫ్ 2″. కరోనా గొడవ లేకపోతే ఈ సినిమా రిలీజ్ కు ముస్తాబు అవుతూండేది.  రిలీజ్ కు ముందే కేజీఎఫ్ చాప్టర్-2 సంచలనాలు సృష్టిస్తోంది. పెద్ద మొత్తంలో ప్రి రిలీజ్ బిజినెస్ చేస్తోంది. తాజాగా ఆడియో హక్కుల విషయంలోనూ రికార్డులను బద్ధలు కొట్టింది. లాక్ డౌన్,సెకండ్ వేవ్ లేకుండా ఉంటే ఈ పాటికే విడుదల కావాల్సి ఉన్న ఈ భారీ చిత్రానికి సంబందించిన ఓ అప్డేట్ ఇప్పుడు సినీ లవర్స్ ని ఉత్సాహపరుస్తోంది. 

 అదేమిటంటే...కేజిఎఫ్ చాప్టర్ 2 కి సంబంధించి సౌత్ ఇండియా ఆడియో రైట్స్ ను 7.2 కోట్ల రూపాయలకి గాను లహరి మ్యూజిక్ మరియు టి సిరీస్ లు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు కేజీఎఫ్ ఛాప్టర్ 1 విడుదలైన  డిసెంబర్‌లోనే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎవరు పోటీలేని టైమ్‌లో కేజీఎఫ్ విడుదలైన డేట్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
  
 కేజీఎప్ 2 ఛాప్టర్ 2 కోసం రాకింగ్ స్టార్ తన రెమ్యునరేషన్‌ను దాదాపు రూ. 30 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు శాండిల్ వుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 200 కోట్ల వరకు బిజినెస్ చేసింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి అగ్ర తారాగణంతో తెరకెక్కింది. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజరు దత్‌ అధీరా అనే పవర్‌ ఫుల్‌ రోల్‌లో నటిస్తుండగా హోంబేల్‌ ఫిల్మ్స్‌ వారు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా.

ఈ సినిమాతో కన్నడ సినిమాల మార్కెట్  ను ఒక్కసారిగా ఆకాశాన్ని అందుకుంది.. కన్నడ ఇండస్ట్రీ టెక్నికల్ గా  ఉన్నత స్థాయిలో ఉండదన్న అపవాదు చెరిపేసింది.కేజీఎఫ్ ను  అత్యుత్తమ నిర్మాణ విలువలతో కూడిన సినిమా ను భారత సినీ ప్రేమికులకు శాండిల్ వుడ్ నిర్మాతలు అందించారు. ఈ సినిమాతో యశ్ హీరో,  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో రాఖీ బాయ్  పోషించిన పాత్ర ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని అలరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios