Asianet News TeluguAsianet News Telugu

హృతిక్, కంగనా వివాదంలో తలదూర్చిన యామిగౌతమ్

  • ముదురుతున్న కంగనా, హృతిక్ ల వివాదం
  • హృతిక్ తో కలిసి ‘కాబిల్’ చిత్రంలో నటించిన యామి గౌతమ్
  • హృతిక్ కి మద్దతు పలికిన యామి గౌతమ్
YamiGautham FB post About Hrithik kangana quarrel

బాలీవుడ్ క్వీన్ కంగనా, హీరో హృతిక్ రోషన్ ల మధ్య వివాదం నానాటికీ ముదురుతోంది. హృతిక్ తనను మోసం చేశాడంటూ కంగనా మీడియా వేదికగా పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయంలో ఇటీవలే హృతిక్ తొలిసారిగా నోరు విప్పారు. తనకు ఆమె(కంగనా) తో వృత్తిపరమైన సంబంధమే తప్ప.. వ్యక్తిగతంగా ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు వీరి వివాదంలో హీరోయిన్ యామీ గౌతమ్ తలదూర్చారు.

 

హృతిక్‌తో `కాబిల్‌` చిత్రంలో నటించిన యామీ గౌత‌మ్ ఫేస్ బుక్ వేదికగా హృతిక్ కి మద్దతు పలికింది.‘చ‌రిత్ర ఆధారంగా మ‌గాడిదే త‌ప్ప‌న‌డం స‌బ‌బు కాద‌ని, ఇలా చేస్తే లింగ స‌మాన‌త్వం కోసం చేస్తున్న పోరాటం త‌ప్పుదోవ ప‌డుతుంద‌ని, ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య విషయాన్ని సామాజిక అంశంగా మార్చొద్ద‌ని’ ఆమె పోస్ట్‌లో పేర్కొంది.
 

YamiGautham FB post About Hrithik kangana quarrel

`సాధారణంగా సోష‌ల్ మీడియాలో నేను పెద్దగా మాట్లడ‌ను. కానీ ఒక మ‌హిళగా ఈరోజు మాట్లాడాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. బాలీవుడ్‌లో ఇద్ద‌రు ప్ర‌ముఖుల వివాదం న‌న్ను స్పందించేలా చేసింది. వారిలో ఒకరితో క‌లిసి నేను ప‌నిచేశాను. అలాగ‌ని అత‌నికి మ‌ద్ద‌తుగా నేను మాట్లాడటం లేదు. ఒక మ‌హిళ‌గా స్పందిస్తున్నాను. నాకు చ‌ట్టాల గురించి పెద్ద‌గా తెలియ‌దు. ఈ వివాదం గురించి కూడా పెద్ద‌గా తెలియ‌దు. కేవ‌లం మీడియాలో వ‌చ్చిన విష‌యాలు మాత్ర‌మే తెలుసు. వాటిని బ‌ట్టి చూస్తే ఆ ప్ర‌ముఖుల వివాదం లింగ స‌మాన‌త్వ అంశంగా మారిన‌ట్టు అర్థ‌మైంది. ఇప్ప‌టికే స‌మాజం అత‌న్ని నేరస్థుడిగా ఖ‌రారు చేసింది.’
 

‘ఈ పోస్ట్ ద్వారా నేను ఎవ‌రికీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం లేదు. ఎవ‌రినీ కించప‌ర‌చ‌డం లేదు. ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య గొడ‌వ‌ను సామాజిక వివాదంగా మార్చొద్ద‌ని మాత్ర‌మే వేడుకుంటున్నాను. ఈ విష‌యంలో నిజానిజాలు బ‌య‌టికి వ‌చ్చే వ‌ర‌కు మ‌న‌మంతా సంయ‌మ‌నం పాటిద్దాం. ప్ర‌తి చిన్న విష‌యాన్ని లింగ స‌మాన‌త్వంతో ముడిపెట్ట‌డం వ‌ల్ల నిజ‌మైన లింగ భేద స‌మ‌స్య‌లు మ‌రుగునప‌డే ప్ర‌మాదం ఉంది` అని యామీ పోస్ట్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios