తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య తేడాపై విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారు తెలంగాణలో మానవత్వం అడుగడుగునా కనిపిస్తుందన్న విజయేంద్ర ప్రసాద్ అయితే ఆంధ్రలో మాత్రం సోషల్ స్టేటస్ ను బట్టే విలువ నిస్తారని తన అభిప్రాయం
ఆంధ్ర, తెలంగాణల మధ్య తేడా ఏంటి.. అసలు ఇక్కడి మనుషులు అక్కడి మనుషులతో విడిపోవాలని బలంగా కోరుకున్న నేపథ్యంలో భారీ ఉద్యమం ఎందుకు పుట్టింది.. ఎందుకంటే మానవత్వపు విలువలతో కూడిన ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలపై అర్థ బలం చేసిన దాడిని తిప్పి కొట్టడానికి. మానవత్వం తెలంగాణలో ఏ స్థాయిలో ఉంటుందో, ఆంధ్ర ప్రాంత వాసులకు కరువైన మానవత్వం డబ్బుకు ఎలా లొంగుతుందో సాక్షాత్తూ.. ఆంధ్ర ప్రాంతానికే చెందిన బాహుబలి చిత్ర రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కుండబద్దలు కొట్టారు.
తెలంగాణకు ఆంధ్రకు తేడా ఏంటి.. తెలంగాణలో ప్రజల వ్యవహార శైలి ఎలా ఉంటుంది.. తమ ఇంటికి వచ్చిన వ్యక్తిని లేదా తమ ఊరికి వచ్చిన వ్యక్తిని తెలంగాణ వాసులు ఎలా ఆదరిస్తారు.. మానవ సంబంధాల్లో ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తెలంగాణ ఎలా గొప్పతనం కలిగి ఉంటుంది అన్నది సాక్షాత్తూ బాహుబలి దర్శకుడు రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్(ఆంధ్ర ప్రాంత వాసి) ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.
“తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా.. బాబూ టీ తాగుతారా.. అన్నం తింటారా.. అని అడుగుతారు. ఎదుటి వ్యక్తి సోషల్ స్టేటస్ గురించి.. అతను ఎంత సంపాదిస్తాడు.. అతడు ఎవరు.. అన్నది పట్టించుకోరు. ఇది నాకు ఎంతో బాగా నచ్చుతుంది. అదే ఆంధ్రలో అయితే ఎక్కడికి వెళ్లినా ముందు నువ్వు ఏం చేస్తావు బాబూ... మీ నాన్న గారు ఏం చేస్తారు.. అంటూ సోషల్ స్టేటస్ గురించి ఆరా తీస్తారు. దాన్ని బట్టే మర్యాద ఇస్తారు.” అని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.
ఆంధ్రలో మనుషుల మధ్య సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే ఉంటాయి. మనిషి ఆర్థిక స్థితిని బట్టి అతనికి గౌరవం దక్కుతుంది. కానీ తెలంగాణలో డబ్బుకి ప్రాధాన్యత తక్కువ. మానవత్వానికి ఎక్కువ విలువనిస్తారు. ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే వీలయినంత వరకు అతన్ని ఆదుకోవాలని ప్రయత్నిస్తారు. అంటూ విజయేంద్ర ప్రసాద్ తన అనుభవాల్ని వెల్లడించారు.
