జీ5లో మార్చి 17న 'రైటర్ పద్మభూషణ్' వరల్డ్ వైడ్ ప్రీమియర్స్
డెబ్యూ డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రం 'రైటర్ పద్మభూషణ్'. ఈ చిత్రం మార్చి 17న వరల్డ్ వైడ్ గా జీ 5లో ప్రీమియర్ కాబోతోంది.

డెబ్యూ డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రం 'రైటర్ పద్మభూషణ్'. కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. లహరి ఫిలిమ్స్, ఛాయ్ బిస్కెట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ నిర్మించారు. ఈ చిత్రంలో యువ నటుడు సుహాస్ లీడ్ రోల్ లో నటించారు. రచయిత కావాలని కలలుకనే యువకుడిగా సుహాస్ నటించడం విశేషం. టీనా శిల్పరాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్థి ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ వెంకట్ శాకమూరి అందించగా.. కోదాటి పవన్ కళ్యాణ్, సిద్దార్థ్ తాతోలు ఎడిటింగ్ అందించారు.
కథ విషయానికి వస్తే.. లైబ్రరీ ఉద్యోగిగా పని చేసే పద్మభూషణ్ ( సుహాస్) మంచి రచయిత కావాలని కలలు కంటుంటాడు. తన సొంత ఖర్చులతో పద్మభూషణ్ ప్రచురించిన తన తొలి పుస్తకం 'తొలి అడుగు'కి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించదు. కానీ ఆ తర్వాత ప్రతి ఒక్కరూ అభిమానించే రచయితగా పద్మభూషణ్ ఎదుగుతాడు. తనకు సంబంధం లేని పుస్తకం ఒకటి పద్మభూషణ్ పేరుతో విడుదలై అతడికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ కథని హాస్య భరితంగా చూపించారు. ఆ పుస్తకాన్ని రచించిన అసలు రచయిత ఎవరు ? తన పేరుపై ఎందుకు ప్రచురించారు ? అనే అంశాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది.
ఇదిలా ఉండగా ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా.. ఆయనతో కలసి శరత్ చంద్ర పాటలు అందించారు. ఫిబ్రవరి 3న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని నవ్వించే విధంగా ఉంటుందని దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెలిపారు. ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం మార్చి 17న వరల్డ్ వైడ్ గా జీ 5లో ప్రీమియర్ కాబోతోంది.
కథాంశం
ఈ చిత్ర కథ విజయవాడ నేపథ్యంలో సాగుతుంది. పద్మభూషణ్ పాత్ర చుట్టూ ఈ ఈ కథ ఉంటుంది. తన తల్లిందండ్రులకు ఒక్కగానొక్క కొడుకైన పద్మభూషణ్ మంచి రచయిత కావాలని కలలు కంటుంటాడు. తన జీవితంలో చోటు చేసుకున్న మలుపులు, చివరకి అతడు సారిక మనసు ఎలా గెలుచుకున్నాడు అనే అంశాలతో కథ ఉంటుంది.
నటీనటులు
పద్మభూషణ్ పాత్రలో సుహాస్
సారిక పాత్రలో టీనా శిల్పరాజ్
పద్మభూషణ్ తల్లి సరస్వతి పాత్రలో రోహిణి
పద్మభూషణ్ తండ్రి మధుసూదన్ రావు పాత్రలో ఆశిష్ విద్యార్థి
కన్నా పాత్రలో గౌరీ ప్రియ
రిలీజ్ డేట్
ప్రఖ్యాత జీ5 సంస్థ రైటర్ పద్మభూషణ్ వరల్డ్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం జీ 5 ఓటిటి వేదికపై మార్చి 17, 2023 నుంచి అందుబాటులో ఉంటుంది. పాజిటివ్ సందేశంతో, భావోద్వేగాలతో ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది. రెండున్నర నిమిషాల నిడివిగల రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లో కామెడీ, రొమాంటిక్ మూమెంట్స్ ఉన్నాయి. ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.