టాలీవుడ్ లో కొన్ని హిట్ చిత్రాలకు కథ అందించిన రైటర్ చిన్ని కృష్ణకి ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గాయి. మీడియాలో కూడా ఎక్కడా ఆయన ఊసు పెద్దగా లేదు. అటువంటి క్రమంలో మెగాఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై కామెంట్స్ చేసివార్తల్లో నిలిచాడు.

చంద్రబాబుని సైతం టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. వైసీపీకి మద్దతుదారుడు కావడంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్, చంద్రబాబులను విమర్శించాడు. ఈ క్రమంలో ఆయన చిరంజీవిపై కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అలానే దర్శకుడు బోయపాటి శ్రీనుని ఉద్దేశిస్తూ ఆయనొక మూర్ఖుడని కామెంట్ చేయడం వైరల్ గా మారింది. నిన్న గాక మొన్న బోయపాటి ఓ సినిమా తీశాడని.. విలన్ తలకాయలను హీరో నరికితే వారిని గాల్లోనే గద్దలు ఎగరేసుకొనే వెళ్లడం వంటి సినిమాలు తీసే మూర్ఖుడని, అజ్ఞాని అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

పశువుకంటే హీనమైన ఆ డైరెక్టర్ తో చంద్రబాబు నాయుడు  పుష్కరాల ఏర్పాట్లు చేయించి ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని విమర్శించారు.