ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్.. తాజాగా వీల్‌చైర్లో కూర్చొని కనిపించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు ఏమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ వీల్ చైర్ లో కూర్చుని కనిపించడం కలకలం రేపుతోంది. మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో టైసన్ ఇలా వీల్‌చైర్లో కనిపించాడు. 56 ఏళ్ల టైసన్ వీల్‌చైర్లో ,వాకింగ్ స్టిక్ పట్టుకొని కనిపించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

ఇక రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా.. టాలీవుడ్ నుంచి తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం వరకు సినిమా ప్రమోషన్స్‌లో బిజిబిజీగా గడిపిన మైక్‌ టైసన్.. తాజాగా వీల్‌చైర్లో కూర్చొని కదలలేని పరిస్థితిలో కనిపించిన పోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

టైసన్‌ మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి మైక్ టైసన్ బయటకు వస్తున్నప్పుడు ఈ ఫోటోలు తీసినట్టు తెలుస్తోంది. అంతే కాదు మైక్ టైసన్‌ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంత మంది ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడటం విమర్షలకు దారి తీస్తోంది. అయితే అసలు మైక్ టైసన్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అని అభిమానులు ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. టైసన్‌ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికాతో బాధపడుతున్నట్లు తెలిసింది. 

Scroll to load tweet…

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మైక్ టైసన్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.. ఎక్స్‌పైరీ డేట్‌కు దగ్గర పడుతున్నానని చెప్పిన అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ప్రస్తుతం ఆయన మాటల గురించి జనం మాట్లాడుకుంటున్నారు. మైక్ టైసన్ కోసం.. ఇంటర్నేషనల్ ఫేమస్ డాక్టర్లు ఆయనకు ట్రీట్ మెంట్ చేస్తున్నట్టు సమాచారం. అయితే వారు టైసన్‌ను వీల్‌ చైర్‌ వాడాలని సూచించారట. ఈ విషయం తెలసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

ప్రపంచాన్ని ఏలిన దిగ్గజ బాక్సర్‌కు ఈగతి పట్టిందేనని ఫీల్ అవుతున్నారు అభిమానులు.. ఇదిలా ఉంటే, విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా సినిమా లైగర్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 25న సినిమా ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా అనన్య పాండే నటించగా.. టైసన్‌ కీ రోల్‌ పోషించాడు.