Asianet News TeluguAsianet News Telugu

రక్తదానం చేసిన చిరు దంపతులు

అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే రక్తదానం గురించి మరోమారు గొప్ప చెప్పారు చిరంజీవి. ఇక చిరంజీవి సతీమణి సురేఖ కూడా రక్తదానం చేయడం విశేషం.

world blood donors day chiru and his wife donates blood ksr
Author
Hyderabad, First Published Jun 14, 2021, 2:18 PM IST


రక్తదానంపై అవగాహన తీసుకొచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. దశాబ్దాల క్రితమే రక్తదానం ప్రాముఖ్యత గమనించి చిరంజీవి తన సినిమాలు, ఆడియో క్యాసెట్స్ ద్వారా రక్తదానం గురించి ప్రచారం చేసేవారు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఏర్పాటు చేసి ఏళ్లుగా వాటిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. నేడు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే పురస్కరించుకొని చిరంజీవి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ఆయన విషెస్ తెలియజేశారు. 


అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే రక్తదానం గురించి మరోమారు గొప్ప చెప్పారు చిరంజీవి. ఇక చిరంజీవి సతీమణి సురేఖ కూడా రక్తదానం చేయడం విశేషం. స్టార్ గా కంటే కు సామాజిక సేవా స్పృహ కలిగిన వ్యక్తిగా చిరంజీవికి మంచి పేరుంది. కోవిడ్ ఆపద సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు చిరంజీవి. 


రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. అవసరమైన కరోనా రోగులకు ఆయన అభిమానులు ఆక్సిజన్ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రీకరణ దశలో ఉంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. సమ్మర్ కి రావలసిన ఆచార్య వాయిదా పడింది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో చరణ్, పూజ హెగ్డే కూడా నటిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios