ఆ సినిమా ఏ మేరకు వెంకీకు సెట్ అవుతుందనేది చూడాలంటున్నారు. ఈ మేరకు సురేష్ బాబు, వెంకీ కలిసి ఆ సినిమా చూడబోతున్నట్లు..
ఎక్కడైనా మంచి హిట్ సినిమా వస్తే దాన్ని రీమేక్ చేసి హిట్ కొట్టడం వెంకటేష్ చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు. ఇదే పద్దతిలో ఇప్పుడు వెంకటేష్ కన్ను ఓ బాలీవుడ్ సినిమాపై పడిందంటున్నారు. అయితే ఆ సినిమా ఏ మేరకు వెంకీకు సెట్ అవుతుందనేది చూడాలంటున్నారు. ఈ మేరకు సురేష్ బాబు, వెంకీ కలిసి ఆ సినిమా చూడబోతున్నట్లు తెలస్తోంది. ఇంతకీ ఏమిటా సినిమా అంటే సైతాన్. బాలీవుడ్ లో రీసెంట్ గా హిట్ టాక్ తెచ్చుకుని జనాలను థియేటర్స్ కి రప్పిస్తున్న చిత్రం ఇది. ట్రైలర్ తో మంచి బజ్ ను సొంతం చేసుకున్న అజయ్ దేవగన్(Ajay Devgn) ఆర్ మాధవన్(R Madhavan) ల కాంబినేషన్ లో వచ్చిన సైతాన్(Shaitaan).వెంకటేష్ గత చిత్రం దృశ్యం ని గుర్తు చేస్తూ ఈ సినిమా సాగుతుంది. అజయ్ దేవగన్ చేసిన పాత్రను వెంకటేష్ చేస్తే ఎలా ఉంటుందనే యాంగిల్ లో సినిమా చూడబోతున్నారట. మాధవన్ ని అలాగే ఉంచేస్తారట.
శివరాత్రి హాలిడే రోజున రిలీజ్ అయిన ఈ సినిమా మరాఠీ లో వచ్చిన వష్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ చూడని వాళ్ళకి బాగానే నచ్చుతోంది అంటున్నారు. అలాగే ఒరిజినల్ చూసిన వాళ్ళకి ఓకే అనిపించేలా ఉండగా చూడని వాళ్ళకి మాత్రం సినిమా చాలా కొత్తగా అనిపించడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఆర్ మాధవన్ తన నటనతో సినిమాను మరో లెవల్ కి తీసుకు వెళ్ళాడనే టాక్ ఇప్పుడు అంతటా స్ప్రెడ్ అవుతోంది. సుమారు 15 కోట్లకు పైగా ఓపెనింగ్ తెచ్చుకపవివ ఈ సినిమాకి క్రిటిక్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. కానీ క్రూరమైన విలన్ పాత్రలో మాధవన్ అవార్డ్ విన్నింగ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పటం ప్లస్ అవుతోంది. అజయ్, జ్యోతిక వంటి మేటి నటులను డామినేట్ చేశారని మాధవన్ నటనకు ప్రశంసలు లభించాయి.
సినిమా కథ పాయింట్ కి వస్తే…కబీర్ (అజయ్ దేవ్‍గణ్), భార్య జ్యోతి (జ్యోతిక)ని తీసుకుంది ఇద్దరు పిల్లలతో ఫామ్ హౌస్‍లో వెకేషన్ కోసం బయిలుదేరతాడు. మధ్య దారిలో వారికి వనరాజ్ (మాధవన్) పరిచయం అయ్యి.. మాటలు కలుపుతాడు. అంతేకాకుండా కబీర్ కూతురు జాన్వీ (జానకి)కి ఓ పదార్థం ఇస్తాడు. అది తీసుకున్నప్పటి నుంచి వనరాజ్ ఏం చెబితే జాన్వీ ఆ మాట వింటూ చేస్తూంటుంది. ఆ తర్వాత కబీర్ ఫ్యామిలీని ఫాలో అవుతూ ఫామ్ హౌస్‍కు వెళతాడు వనరాజ్. అక్కడ నుంచి జాన్వీని తన ఆధీనంలోకి తీసుకొని.. బీభత్సమైన సృష్టిస్తాడు. ఈ క్రమంలో వనరాజ్‍ను కబీర్ ఎలా కట్టడి చేసి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు?అసలు వనరాజ్ ఎవరు? ఈ ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేశాడు? అనేవే ఈ చిత్రంలో కీలకాంశాలు.
