దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశాడు. ఏ జోనర్ ఈ మూవీ తెరకెక్కుతుందనే సందేహాలు మొదలయ్యాయి. అలాగే ఈసారి ఏ పాత సినిమా లేక నవల కాపీ చేస్తున్నాడో అంటూ సెటైర్స్ పేలుతున్నాయి.

త్రివిక్రమ్ (Trivikram) కి పరిశ్రమలో ఎంత గొప్ప పేరుందో అంతే చెడ్డ పేరుంది. ఈ దర్శకుడు తెరకెక్కించిన చిత్రాల కథలు, సన్నివేశాలు ఎక్కడో ఓ చోట నుండి తస్కరించినవే అంటారు. కొన్నిసార్లు అడ్డంగా దొరికిపోగా తెలుగు ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ని అజ్ఞాతవాసి గా తెరకెక్కించి త్రివిక్రమ్ అబాసుపాలయ్యారు. అజ్ఞాతవాసి హిట్ అయితే త్రివిక్రమ్ తప్పు అంతగా వెలుగులోకి వచ్చేది కాదు. తెలిసినా విజయం హోరులో కొట్టుకుపోయేది. లార్గో వించ్ దర్శకుడు తన చిత్రాన్ని కాపీ చేసారంటూ న్యాయపోరాటానికి దిగడంతో మరింత రచ్చ అయ్యింది. 

ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి 'మీనా' నవల ఆధారంగా 'అ ఆ' మూవీ చేశాడు. చిత్ర విడుదల తర్వాత మీడియా, జనాలు నిలదీయడంతో అవునని ఒప్పుకున్నాడు. ఇక లేటెస్ట్ సెన్సేషన్ అల వైకుంఠపురంలో కూడా కాపీ సినిమానే. ఎప్పుడో ఎన్టీఆర్ నటించిన ఇంటిగుట్టు చిత్రానికి అది లేటెస్ట్ వర్షన్. ఇలా త్రివిక్రమ్ చేసే ప్రతి సినిమాకు హాలీవుడ్ లోనో టాలీవుడ్ లోనో మూలాలు ఉంటాయి. గొప్ప మాటల రచయిత అయిన త్రివిక్రమ్ కథా రచయిత కాదు. 

ఓ సక్సెస్ ఫుల్ ఫార్మాట్ సిద్ధం చేసి అందులో కొత్త హీరోను పాత్రలను జొప్పించి ఓ సినిమా సిద్ధం చేస్తారు. ఆయన విజయ రహస్యం అదే. అందులోనూ దశాబ్దాల నాటి పాత సినిమా కథలు ఈ తరానికి తెలియవు. వాటిలో ఓ మంచి కథను ఎంచుకొని అప్డేట్ వర్షన్ సిద్ధం చేసుకొని స్టార్ హీరోలతో చేసేస్తున్నారు. కాగా మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ సైతం ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. రెండు నెలల్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో త్రివిక్రమ్ మహేష్ (Mahesh Babu) కోసం ఏ పాత సినిమా కథ సిద్ధం చేస్తున్నాడో? ఏ తెలుగు నవల దుమ్ముదులుపుతున్నాడో అంటూ సెటైర్స్ వేస్తున్నారు. అల వైకుంఠపురంలో విషయంలో ఆయన నమ్మిన సూత్రం విజయం సాధించిన నేపథ్యంలో, ఈసారి కూడా పాత సినిమా కథకే మెరుగులు దిద్దే అవకాశం కలదని అంచనా వేస్తున్నారు. మరి దీనిపై స్పష్టత రావాలంటే షూటింగ్ మొదలు కావాలి. 

ఇక దాదాపు రూ. 200 కోట్ల  బడ్జెట్ తో ఈ మూవీ(SSMB 28) తెరకెక్కుతుంది. అర్జునుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.