నేడు బిగ్ బాస్ షో చాలా ప్రత్యేకం. టాలీవుడ్ లక్కీ లేడీ సమంత హోస్ట్ గా రంగంలోకి దిగనుంది. కింగ్ నాగార్జున స్థానాన్ని ఆమె భర్తీ చేస్తూ నేడు బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించనుంది. వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం కులు మనాలి వెళ్లిన నాగార్జున కొద్దిరోజులు అక్కడే ఉండనున్నారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా తెలియజేశారు. 

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హోస్ట్ గా సమంత అవకాశం దక్కించుకుంది. దీనిపై అధికారి ప్రకటన కూడా వచ్చేసింది. స్టార్ మా సమంత రాకను ధృవీకరిస్తూ ప్రోమో కూడా విడుదల చేశారు. ఇప్పటి వరకు హీరోయిన్ గా అలరించిన సమంత హోస్ట్ గా ఎంత వరకు ఆకట్టుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. 

నాగార్జున బిగ్ బాస్ హౌస్ కి హాజరుకాని పక్షంలో నేడు ఎలిమినేషన్ ఉంటుందా అనే అనుమానం బిగ్ బాస్ ప్రేక్షకులలో మొదలైంది. ఈ రోజు దసరా పండుగ నేపథ్యంలో కొత్త హోస్ట్ సమంత సరదా ఆటలతో, టాస్క్ లతో హౌస్ మేట్స్ లో జోష్ నింపడం అనేది  ఖాయం. సమంతను హోస్ట్ గా చూసిన హౌస్ మేట్స్ సైతం షాక్ గురయ్యే అవకాశం ఉంది. 

సరదాగా షోలో నడిచే సీరియస్ ఎలిమినేషన్ తంతును కూడా సమంత నడుపుతారా లేదా అనేది ఆసక్తికరం. ఈ వారం ఎలిమినేషన్స్ లిస్ట్ లో మొత్తం 6 సభ్యులు ఉన్నారు. మోనాల్, నోయల్, ఆరియానా, అవినాష్, దివి మరియు అభిజిత్ నామినేట్ కావడం జరిగింది. నేడు ఈ ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది.