మహేష్ బాబు గడ్డం సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా..?

Will Superstar Mahesh Babu Break his Sentiment ?
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నాడు. 'భరత్ అనే నేను'

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నాడు. 'భరత్ అనే నేను' చిత్రంతో రీసెంట్ గా ఘన విజయం అందుకున్న ఈ హీరో ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఆయన కెరీర్ లో మైలురాయిగా మారనున్న ఈ 25వ సినిమాలో అతడు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. గడ్డం, మీసం పెంచి మునుపెన్నడూ చూడని విధంగా ఓ సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మహేష్ బాబు గడ్డం పెంచుతున్నాడని తెలుసుకున్న అభిమానులు అతడిని వెండితెరపై చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా మహేష్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో కెమెరాలు క్లిక్ మానిపించారు. ఇందులో మహేష్ గడ్డం, మీసం చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన నటుడు తమకు ఐఫీస్ట్ ఇవ్వడం ఖాయమని నమ్ముతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ నిజానికి మహేష్ బాబుకి గడ్డం సెంటిమెంట్ ఇప్పటివరకు వర్కవుట్ కాలేదు. గతంలో ఆయన నటించిన 'టక్కరిదొంగ' సినిమాలో తొలిసారి ఆయన మీసాలు, గడ్డం పెంచి కనిపిస్తే.. ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయింది.

ఆ సినిమా తరువాత మళ్లీ 'నిజం' సినిమాలో కాసింత గడ్డంతో కనిపించాడు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇలా తాను గడ్డం పెంచిన నటిస్తే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయనే సెంటిమెంట్ తో తన దగ్గరకు వచ్చిన దర్శకనిర్మాతలు గడ్డం, మీసం పెంచమంటే నిర్మొహమాటంగా నో చెప్పేవాడని సమాచారం. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా మొదట ఈ రిక్వెస్ట్ మహేష్ ముందుంచితే ఆయన ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కానీ కథపై ఉన్న నమ్మకంతో మాస్ లుక్ లో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. మరి తన గడ్డం సెంటిమెంట్ ను ఈ సినిమాతో బ్రేక్ చేస్తాడేమో చూడాలి!
  

loader