చిరు, బాలయ్యలను కలవరపెడుతున్న శృతి హాసన్!
సంక్రాంతి సమరంలో ప్రతి ఒక్కరూ విన్నర్ కావాలి అనుకుంటారు. దీని కోసం ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఒక్కరోజు గ్యాప్ తో విడుదల కానున్నాయి. ఒకరోజు అటూ ఇటుగా ప్రీరిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి. కాబట్టి శృతి ఈ రెండు చిత్రాల ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది.

ఇద్దరు స్టార్ హీరోల సంక్రాంతి చిత్రాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అరుదుగా వస్తుంది. గతంలో నరసింహనాయుడు, మృగరాజు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఆ రెండు చిత్రాల్లో హీరోయిన్ గా సిమ్రాన్ చేశారు. చాలా కాలం తర్వాత చిరంజీవి-బాలకృష్ణ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. శృతి హాసన్ ఈరెండు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆ విధంగా శృతి హాసన్ ఒక రేర్ ఫీట్ సాధించింది. ఈ రెండు చిత్రాల్లో ఏది హిట్టయినా శృతికి మేలు జరుగుతుంది.
అయితే ఆమె నుండి సంక్రాంతి హీరోలకు ఏ మాత్రం సహకారం అందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇంత వరకు ఈ చిత్రాల గురించి శృతి పెద్దగా పట్టించుకున్న దాఖలు లేవు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ కూడా వేయడం లేదు. సంక్రాంతి సమరంలో ప్రతి ఒక్కరూ విన్నర్ కావాలి అనుకుంటారు. దీని కోసం ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఒక్కరోజు గ్యాప్ తో విడుదల కానున్నాయి. ఒకరోజు అటూ ఇటుగా ప్రీరిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి. కాబట్టి శృతి ఈ రెండు చిత్రాల ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది.
ఆమె ఊపిరి పీల్చుకోలేనంత బిజీ కానున్నారు. అయితే శృతి ఇటీవల ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఫీవర్, సైనస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు వెల్లడించారు. ఆమె ముఖం వాచి, ఎర్రగా కందిపోయి కనిపించింది. శృతి పూర్తి ఆరోగ్యంగా లేరని ఆమె పోస్ట్ ద్వారా తెలుస్తుంది. మరి ఆరోగ్య కారణాలు చూపుతూ ప్రమోషన్స్ ఎగ్గొడితే అసలుకే ఎసరు వస్తుంది. ఓ కోణంలో చిరు, బాలయ్య ప్రయోజనాలు కోల్పోతారు.
ప్రస్తుతం శృతి ముంబైలో ప్రియుడితో పాటు ఉంటున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల ప్రమోషన్స్ కోసం ఆమె ప్రతిసారి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న చిత్ర వర్గాలు శృతి అంతగా సహకరించకపోవచ్చు అంటున్నారు.