Asianet News TeluguAsianet News Telugu

#Salaar ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ కష్టమా..?

 ఈ చిత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతోంది. అలాగే   USA, గల్ప్ కంట్రీలలోనూ తన సత్తా చూపుతోంది. 

Will Salaar reach breakeven in Andhra Pradesh Box Office Collection jsp
Author
First Published Dec 30, 2023, 11:59 AM IST


 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  #Salaar బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తొలిరోజే రూ.178 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ వీకెండ్ పూర్తి కాకముందే రూ.500 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.  కొద్దిగా డ్రాప్ అయ్యినా , ఈ వీక్ లో డెవిల్ తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేకపోవటంతో ఎదురేలేకుండా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ అన్నిచోట్ల డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.  అయితే ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ కష్టమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...

 నైజాంలో స‌లార్ చిత్రం రూ.50 కోట్ల మైలు రాయిని ఇప్పటికే అందుకొంది.  అక్కడ దాదాపు బ్రేక్ ఈవెన్ కు దగ్గరైపోయినట్లే.  ఇక ఆంధ్రాలోనూ  కలెక్షన్స్ బాగున్నాయి. అయితే అక్కడ టికెట్ రేట్ల‌ు తక్కువగా ఉండటం దెబ్బ కొడుతోందని అంటున్నారు. సలార్ కు ఉన్న క్రేజ్ తో  సినిమాను ఎక్కువ రేట్లకు  కొన్నారని, కానీ ఇప్పుడున్న ఈ  రేట్ల‌కు గిట్టుబాటు అవ్వ‌డం లేదని చెప్తున్నారు. ఈ సినిమాకు ఆంధ్రాలో అదిరిపోయే ఓపెనింగ్స్ వ‌చ్చినా మిగిలేది తక్కువని, కాబట్టి ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వ‌టానికి ఇంకా టైమ్ పడుతుందని అంటున్నారు.

 ఇప్పుడున్న ఈ స్పీడ్ , రన్ ఎప్పటివరకూ ఉంటుందనే దానిపై బ్రేక్ ఈవెన్ ఆధాపడి ఉంటుందని చెప్తున్నారు.  సంక్రాంతి సినిమాలు వచ్చేలోగా వర్కవుట్ అవుతేనే బ‌య్య‌ర్లు గ‌ట్టెక్కుతారని లెక్కలేస్తున్నారు. కొందరు కొద్దిపాటి నష్టాలు కూడా వచ్చే అవకాసం ఉందని ట్రేడ్ లో డిస్కస్ చేస్తన్నారు.   భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యిన ఈ చిత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతోంది. అలాగే   USA, గల్ప్ కంట్రీలలోనూ తన సత్తా చూపుతోంది. 

‘కేజీయఫ్‌’లో నరాచీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్‌ నీల్‌.. ‘సలార్‌’తో ఖాన్సార్‌ వరల్డ్‌ని పరిచయం చేసారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం.  దేవ- వరదరాజ మన్నార్‌ శత్రువులుగా మారడానికి కారణమేంటి?అని ఉత్సాహంగా చర్చించుకుంటూ థియేటర్స్ కు జనం వెళ్తున్నారు.. అసలు ఖాన్సార్‌ కథేంటి? అనేది  డిస్కషన్ గా మారింది. 

ప్రభాస్  పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన   సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ చూసి  రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ఎప్పుడూ అని అడుగుతున్నారు. అయితే ఇది ప్యాన్ ఇండియా సినిమా. కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే కాదు ...హిందీ, కన్నడ, మళయాళ,తమిళ మార్కెట్ లలో కూడా అక్కడ భాషల్లోకి డబ్బింగ్ అయ్యి భారీగా రిలీజ్ అయ్యింది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios