దసరా మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంతో బాక్సాఫీస్ షేక్ చేస్తామని హీరో నాని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన్ని ఓ బ్యాడ్ సెంటిమెంట్ భయపెడుతుంది.  

దసరా చిత్ర విజయంపై హీరో నాని చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆయన ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఆయన ట్రాక్ ఏమంత బాగోలేదు. ఈ మధ్య కాలంలో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం మాత్రమే హిట్ స్టేటస్ అందుకుంది. గత ఏడాది విడుదలైన అంటే సుందరానికీ డిజాస్టర్ అయ్యింది. నాని మార్కెట్ ని బాగా దెబ్బతీసిన చిత్రం అది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. 

ఈ క్రమంలో కసిగా దసరా చిత్రం చేశారు. విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమా విజయం మీద నమ్మకం పెంచింది. అయితే నానిని ఓ బ్యాడ్ సెంటిమెంట్ భయపెడుతుంది. దసరా చిత్రాన్ని నిర్మించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ దారుణమైన రికార్డు కలిగి ఉంది. ఈ సంస్థ అధినేత సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు వరుసగా అట్టర్ ప్లాప్ అయ్యాయి. 

బాలకృష్ణ మూవీ లయన్ తో సుధాకర్ చెరుకూరి నిర్మాత అయ్యారు. లయన్ డబుల్ డిజాస్టర్. హీరో శర్వానంద్ తో చేసిన పడి పడి లేచె మనసు ప్లాప్ కాగా, ఆయనతోనే చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు డిజాస్టర్ అయ్యింది. ఆ సంస్థలో తెరకెక్కిన నాలుగో చిత్రం విరాటపర్వం. రానా-సాయి పల్లవి నటించిన ఈ పీరియాడిక్ రివల్యూషనరీ లవ్ డ్రామా డిజాస్టర్ అయ్యింది. ఇక మాస్ మహరాజ్ రవితేజ కూడా ఈ బ్యానర్ కి హిట్ ఇవ్వలేకపోయాడు. 

రామారావు ఆన్ డ్యూటీ రవితేజ కెరీర్లో చెత్త మూవీగా నిలిచిపోయింది. ఆరో ప్రయత్నంగా పాన్ ఇండియా మూవీ దసరా చేస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ రూ. 50 కోట్లకు పైమాటే. ఈ తరుణంలో నిర్మాత సుధాకర్ చేరుకూరిని వెంటాడుతున్న డిజాస్టర్ సెంటిమెంట్ ని హీరో నాని అధిగమిస్తాడా లేదా అనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ సెంటిమెంట్ కంటిన్యూ అయితే నానికి కష్టాలు తప్పవు. అయితే ఈ సెంటిమెంట్స్ మూఢ నమ్మకాలు మాత్రమే. ప్రతిసారి జరుగుతాయనే గ్యారంటీ ఉండదు. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరి వాదన. 

దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మార్చి 30న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. డార్క్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. లవ్, పాలిటిక్స్, సోషల్ డిఫరెన్సెస్ వంటి విషయాలు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.