Asianet News TeluguAsianet News Telugu

అల్లు అరవింద్ రిక్వెస్ట్ ని చిరంజీవి ఓకే చేస్తారా?

పాలు,నీళ్లలా కలిసిపోయిన చిరంజీవిని రీసెంట్ గా అల్లు అరవింద్ కలిసి ఓ రిక్వెస్ట్ చేసారట. అయితే ఆ రిక్వెస్ట్ ని చిరంజీవి వెంటనే ఆమోదించలేదట. ఇంతకీ ఏమిటా రిక్వెస్ట్... 

Will Chiranjeevi Agree To Allu Arvinds Request?
Author
Hyderabad, First Published Sep 1, 2021, 10:31 AM IST

బావ,బావమరిదులుగానే కాకుండా చిరంజీవి, అల్లు అరవింద్ ఎంత సన్నిహితంగా ఉంటారో తెలిసిందే. చిరంజీవి ఇమేజ్ అరవింద్ వ్యాపారాలకు తోర్పడితే, అరవింద్ తెలివితేటలు చిరు సినీ కెరీర్ ఉన్నతికి తోర్పడ్డాయంటారు. కాబట్టే చాలా ప్రెండ్లీగా ఉంటారని అంటారు. చిరంజీవి హీరోగా అరవింద్ నిర్మాతగా చాలా సినిమాలు వచ్చాయి. చివరకు చిరంజీవి పార్టీ పెట్టినా అరవిందే స్వయంగా వెనక ఉండి నడిపించారని అంటారు. వారిద్దరి మధ్య బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువగా ఉంటుంది. సినిమాలు కుటుంబం రాజకీయం...ఇలా చిరుకు సంబంధించిన అన్ని విషయాలలో అల్లు అరవింద్ పాత్ర ఎంతో కీలకమైనది.   ఇలా పాలు,నీళ్లలా కలిసిపోయిన చిరంజీవిని రీసెంట్ గా అల్లు అరవింద్ కలిసి ఓ రిక్వెస్ట్ చేసారట. అయితే ఆ రిక్వెస్ట్ ని చిరంజీవి వెంటనే ఆమోదించలేదట. ఇంతకీ ఏమిటా రిక్వెస్ట్... 

తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ వ్యవస్దాపకుల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆహా అతి తక్కువ కాలంలోనే ఈ స్థాయిలో విజయవంతమైందంటే దానికి అరవిందే ప్రధాన కారణం అనటంలో సందేహం లేదు.  అలాగే ‘ఆహా’ ఓటీటీ ప్రారంభమై  ఏడాది పూర్తయిన సందర్భంగా.. తొలి వార్షికోత్సవ వేడుకను రీసెంట్ గా ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మరిన్ని సరికొత్త వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేస్తోంది ఆహా. వినూత్న సినిమాలతో పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆహా.. తరుపున అరవింద్ పోగ్రామ్ లు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి కు ఆహా తరుపున ఓ ప్రపోజల్ పెట్టారట అరవింద్. 

 అందుతున్న సమాచారం మేరకు... ఆహా కు ఏదైనా స్పెషల్ పోగ్రామ్ చేయమని చిరంజీవి ని కోరారట. ఓ షో హోస్ట్ చేయటమో లేక ఓ వెబ్ సీరిస్ చేయటమో చేస్త బాగుంటుందనేది అరవింద్ ఆలోచనట. అలా చేస్తే కనుక యాప్ కు టెర్రిఫిక్ గా రెస్పాన్స్ వస్తుందని ఆయన భావించి చిరంజీవితో మాట్లాడాటరు. అది టాక్ షో కావచ్చు లేదా గేమ్ షో కావచ్చు...సినిమాలాంటి వెబ్ సీరిస్ కావచ్చు అన్నారట. అలాగే అందుకోసం రకరకాల ఐడియాలు చిరంజివి దగ్గర ప్రపోజల్ గా పెట్టారట. వంశీ పైడిపల్లి, నందినీ రెడ్డి, మిగతా టీమ్ మెంబర్స్ తమ ఆలోచనలను చిరంజీవి ముందు ఉంచాటర.  అయితే చిరంజీవి ఆలోచించి చెప్తాను అన్నారుట. ఎందుకంటే చిరంజీవి వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
 
ఇక చిరంజీవి  రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి చిరంజీవి కేవలం రీమేక్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. "ఖైదీ నెంబర్ 150" కూడా తమిళ్ లో సూపర్ హిట్ అయిన "కత్తి" సినిమాకి రీమేక్ గా విడుదలైంది. ఈ మధ్యనే "సైరా" సినిమాతో హిట్ అందుకున్న చిరు ఇప్పుడు "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత చిరంజీవి తమిళంలో అజిత్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన వేదాళం సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

 మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి మరో రీమేక్ సినిమాకి సైన్ చేశారు. 2015 లో అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన "ఏర్నై అరిందాల్" అని తమిళ సినిమాని చిరంజీవి రీమేక్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మారుతి లేదా వెంకీ కుడుములలో ఎవరో ఒకరు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios