Asianet News TeluguAsianet News Telugu

మన్సూర్ టాపిక్ తెచ్చి త్రిషని భయపెట్టారే...

 ఈ సినిమా గురించి సామాన్యులే కాకుండా సినిమా సెలబ్రెటీలు సైతం మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 

Why Trisha deleted Animal review jsp
Author
First Published Dec 4, 2023, 12:06 PM IST

సందీప్  రెడ్డి వంగా మరోసారి యానిమల్‌తో తన సత్తాను చాటుకున్నాడు. కబీర్ సింగ్‌ను బ్లాక్ బస్టర్ చేశాడు. యానిమల్‌ను అంతకు మించి హిట్ అయ్యేలా తీసి రికార్డ్ లు తిరగ రాస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా యానిమల్‌కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక రెండో రోజుకి,మూడో రోజుకు కలెక్షన్లు పెరిగాయి.  విమర్శలున్నా.. వయలెన్స్ ఎక్కువైందని, బోల్డ్ సీన్లు దారుణంగా ఉన్నాయనే ట్రోలింగ్ జరిగినా దేని గొడవ దానిదే అన్నట్లుంది.  యూత్‌కు బాగా ఎక్కేసినట్టున్నాయి. 

 ఈ మూవీకి కనీసం ఐదు వందల కోట్లు వస్తాయని, రావాలని సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ చెప్పిన సంగతి తెలిసిందే. చూస్తుంటే మరో రెండు మూడు రోజుల్లోనే ఆ మార్క్‌ను దాటేలా ఉంది. ఇక ఈ సినిమా గురించి సామాన్యులే కాకుండా సినిమా సెలబ్రెటీలు సైతం మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఏకంగా రామ్ గోపాల్ వర్మ నాలుగు పేజీల పెద్ద లవ్ లెటర్ లాంటి రివ్యూ ఇచ్చారు.

 ఇక స్టార్ హీరోయిన్  త్రిష ఇవాళ తన ఇన్స్ టాగ్రామ్ లో యానిమల్ ని అభినందిస్తూ కల్ట్ అనే పదం పెట్టి, దాని కిందా ప్పా  “One word- Cult. Paaahhhh.”అంటూ సుదీర్ఘమైన స్మైలీలతో కూడిన ఎక్స్ ప్రెషన్లు ఎమోజిల రూపంలో ఇచ్చింది.  అయితే కొద్ది  సేపట్లోనే   దాన్ని డిలేట్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.

అయితే అదే సమయంలో ఇంటర్నెట్ యూజర్స్ నుంచి చాలా విమర్శలు, తిట్లు అందుకుంది. చాలా సీన్స్ ఆడవాళ్ళను డీగ్రేడ్ చేస్తూ చూపించినా త్రిష మెచ్చుకోవటం నచ్చలేదని అన్నారు. రీసెంట్ గా మహిళల డిగ్నిటి గురించి మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్ విషయమై యుద్దం చేసింది. దాంతో చాలా మంది నెటిజనలు ఈ విషయం లేవనెత్తి క్రిటిసైజ్ చేసారు. ఆమెకు కొద్ది సేపట్లోనే విషయం అర్దమైంది. చాలా మంది తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని. దాంతో ఆ పోస్ట్ ని త్రిష వెంటనే డిలీట్ చేసేసింది. 

Why Trisha deleted Animal review jsp


  
ఇక  యానిమల్ కు డివైడ్ టాక్  కనిపిస్తోంది.  కొంతమందికి పిచ్చ పిచ్చ నచ్చేయగా మరికొందరు సెకండ్ హాఫ్ కంప్లయింట్   చెప్తున్నారు.టాక్  ఎలా ఉన్నా వీకెండ్ మూడు రోజులు భీబత్సం సృష్టించింది. నిన్నైతే దేశవ్యాప్తంగా చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని సెంటర్లలోనూ  ఓపెనింగ్స్ భీభత్సంగా వచ్చాయి.   తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ ఫిగర్లు నమోదు అయ్యాయి. సందీప్ వంగా తెలుగువాడు అవటంతో హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ఫాస్ట్ అదిరిపోయాయి.
 
 యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios