మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి  మొదలైంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్‌ కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన పోలీసులు అధికారి తనయుడు చైతన్య జొన్నలగడ్డను త్వరలో పెళ్లాడనుంది నిహారిక. ఇటీవల తన పెళ్లి వార్తలపై సోషల్ మీడియా ద్వారా నిహారిక క్లారిటీ ఇచ్చింది. గురువారం ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది.

ఈ వేడుకకు మెగా ఫ్యామిలీలోని ప్రతీ ఒక్కరూ హజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌, సుస్మిత, శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌, ఉపాసన ఇలా అంతా హారజరయ్యారు. అయితే ఈ వేడుకలో పవన్‌ మాత్రం కనిపించలేదు. దీంతో అభిమానులు అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ చాతుర్మాస దీక్ష సందర్భంగా హాజరు కాకపోయి ఉంటారా అని భావించినా ఇటీవల నితిన్‌ను పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా దీక్షలోనే ఇంటికి వెళ్లి మరీ ఆశీర్వదించి వచ్చాడు పవన్‌.

మరి అన్న నాగబాబు ఇంట్లో వేడుకకు ఎందుకు హాజరు కాలేదు. నాగబాబు ఎన్నికల సమయంలోనూ పవన్‌కు చాలా అండగా నిలిచాడు. జనసేన పార్టీలో చేరి మరి పవన్‌తో కలిసి ప్రయాణించాడు. అంత అండగా ఉన్న నాగబాబు ఇంట్లో వేడుకకు హాజరు కాలేనంత ఇంపార్టెంట్‌ పని పవన్‌కు ఏమి ఉండి ఉంటుందీ అన్న ఆలోచనలో పడ్డారు పవన్ అభిమానులు. బయటి వాళ్ల ఫంక్షన్లకు వెళుతూ తరుచూ ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్‌ మిస్ చేయటంపై అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది.