ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మంచు ఫ్యామిలీ పాల్గొనలేదు. చిన్నా చితక హీరోలకు దక్కిన ప్రాతినిధ్యం కూడా మంచు ఫ్యామిలీ దక్కలేదు.

ఎన్టీఆర్ అంటే ఎవరు మోహన్ బాబుకు అన్న కాని అన్న. ఆయన ఆరాధ్య దైవం. తనకు జీవితం ఇచ్చిన దేవుడు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో మోహన్ బాబు ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ తో మోహన్ బాబుకు ఉన్న సాన్నిహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. నటుడిగా, నిర్మాతగా మోహన్ బాబు ఎదగడంలో ఎన్టీఆర్ ప్రోత్సాహం ఉంది. మోహన్ బాబు ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్ గా మెలిగారు. ఎన్టీఆర్ కారణంగా హోదా, పలుకుబడి మోహన్ బాబు అనుభవించారు.

ఇక ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీలో మోహన్ బాబు పదవులు కూడా పొందారు. ఎన్టీఆర్ మరణం తర్వాత కూడా టీడీపీలో మోహన్ బాబు క్రియాశీలకంగా ఉన్నారు. మెల్లగా సమీకరణాలు మారాయి. మోహన్ బాబు, నారా చంద్రబాబు నాయుడు మధ్య విబేధాలు తలెత్తాయి. టీడీపీకి పూర్తిగా దూరమయ్యాడు. ఆయన వైసీపీ పార్టీలో చేరాడు. ఈ మధ్య ఆ పార్టీతో డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారు.

అయితే పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. టాలీవుడ్ ప్రముఖులు పదుల సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద కుటుంబాలు గా చెప్పుకునే అక్కినేని, దగ్గుబాటి, మెగా హీరోలు హాజరయ్యారు. నిన్నగాక మొన్న పరిశ్రనలో అడుగుపెట్టిన విశ్వక్, అడివి శేషు, జొన్నలగడ్డ సిద్దూలకు వేదికపై గౌరవం దక్కింది.

మోహన్ బాబు ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా రాలేదు. నందమూరి, నారా కుటుంబాలతో దశబ్దాల అనుబంధం ఉన్న మోహన్ బాబును పిలవలేదా? పిలిచినా రాలేదా? అనే సందిగ్దత నెలకొంది. టాలీవుడ్ టాప్ హీరోల పేరుతో బాలయ్య ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు ఫ్యామిలీ మెంబెర్స్ పేరున ఒక్క ఫ్లెక్సీ కూడా కనపడలేదు. కనీసం మా అధ్యక్షుడు హోదాలో ఉన్న మంచు విష్ణు ప్రస్తావన రాలేదు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సాక్షిగా మోహన్ బాబు కుటుంబానికి అవమానం జరిగిందని పలువురు భావిస్తున్నారు.