రాజకీయ నేపథ్యంతో సాగే కథతో పవన్  'సత్యాగ్రహి'  చిత్రం చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, అనుకోకుండా ఆ చిత్రం మొదట్లోనే ఆగిపోయింది. 


 కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏఎమ్ రత్నం పవన్ కళ్యాణ్ తో ‘సత్యాగ్రహం’ అనే చిత్రాన్ని ప్రకటించారు. 2003లో పవన్ దర్శకత్వంలో, ‘ఖుషి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన శ్రీసూర్య మూవీస్ బ్యానర్ మీద అగ్రనిర్మాత ఏ.ఎమ్. రత్నం ‘సత్యాగ్రహి’ సినిమాను అనౌన్స్ చేశారు. 2003లో అన్నపూర్ణ స్టూడియోలో భారీగా ఓపెనింగ్ కూడా చేశారు. దర్శకరత్న దాసరి క్లాప్, విక్టరీ వెంకటేష్ కెమెరా స్విఛ్చాన్, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. అనివార్య కారణాలతో సినిమాను పక్కన పెట్టేశారు .

అయితే ఆ సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూ వస్తోంది. ఆ సినిమా చేసి ఉంటే చాలా గొప్ప సినిమా అయ్యేదని అభిమానులు అంటూంటారు. అయితే ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందనే దానిపై రకరకాల వాదనలు వినిపించాయి. నిర్మాతతో క్రియేటివ్ డిఫరెన్సెలు వచ్చాయని, స్క్రిప్టు సరిగ్గా రాలేదని, బడ్జెట్ ఎక్కువైందని ఇలా ఎవరికి తోచిన వెర్షన్ వారు చెప్తూంటారు. తాజాగా ఈ విషయమై నిర్మాత ఎఎమ్ రత్నం మాట్లాడారు.

ఎఎం రత్నం మాట్లాడుతూ...“జాని చిత్రం రిజల్ట్ చూసాక, పవన్ చాలా నిరాశపడ్డారు. ఆయన డైరక్షన్ స్కిల్స్ తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదని భావించారు. దాంతో సత్యాగ్రహి చిత్రంపై మా డబ్బుని రిస్క్ చేయటానికి ఇష్టపడలేదు. దాంతో ఆ సినిమా ప్రాజెక్టుని ఆయనే ఆపేసారు ”, అని అన్నారు.

ఇక ఆ మద్యన పవన్ కళ్యాణ్ ఈ చిత్రం గురించి చేసిన ఓట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ఆయన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సమకాలీన కాలంలో ఎమర్జెన్సీ ఉద్యమం నుండి ప్రేరణ పొందిన రాజకీయ చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. 2003లో ప్రారంభం అయింది అనుకుంటా…. ఈ సినిమాలో నటించడం కంటే నిజజీవితంలో అందుకోసం నడవటం మరింత సంతృప్తినిచ్చింది అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ చేసిన ఈ ట్వీట్ అప్పట్లో వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.