అత్తాంరిటికి దారేది చిత్రంతో త్రివిక్రమ్ కెరీర్ లో పీక్స్ కు వెళ్లారు..అజ్ఞాతవాసి సినిమాతో వెనక్కి వచ్చారు. రీసెంట్ గా చేసిన అరవింద సమేత..హిట్ టాక్ తెచ్చుకున్నా పూర్తి స్దాయి సంతృప్తిని ఇవ్వలేకపోయింది. కాపీ వివాదాలు నుంచి సరైన కలెక్షన్స్ లేవనే వరకూ రకరకాలగా మీడియాలో నానింది. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రం ప్రకటనపై అందరి దృష్టీ ఉంది. 

త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం చేయబోయేది అల్లు అర్జున్ నే అని క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ మేరకు ప్రకటన దీపావళి రోజు వస్తుందని అంతా ఆశించారు. కానీ ఎనౌన్సమెంట్ రాలేదు. అందుకు కారణం ..ఎవరికీ అర్దం కాలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రకటన లేటు అవటానికి కారణం..నిర్మాత ఎవరనేది సెట్ కాకపోవటమే అంటున్నారు. నిర్మాత విషయంలోనే త్రివిక్రమ్ తలపట్టుకుని కూర్చున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ఎందుకంటే అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చేద్దామని ఆలోచన. త్రివిక్రమ్ ఈ మధ్యన చేస్తున్న సినిమాలన్నీ హారిక హాసిని బ్యాన‌ర్‌ లో రాధాకృష్ణకు చేస్తున్నారు. ముఖ్యంగా అజ్ఞాతవాసి దెబ్బ నుంచి ఆర్దికంగా బయిటపడేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. దాంతో అటు అల్లు అర్జున్ , ఇటు భాధ్యతగా చెయ్యాల్సిన బ్యానర్ మధ్య ఊగిసలాటలో ఉన్నాడని చెప్తున్నారు. 

మధ్యే మార్గంగా హారిక హాసిని బ్యాన‌ర్‌, గీతా ఆర్ట్స్ కలిపి చేద్దామనే ఆలోచన కూడా ఉందిట. అయితే దీనికి అల్లు అరవింద్ ఒప్పుకోవాలి. ఈ మేరకు తొలి విడత చర్చలు జరిగాయని...ఒకటి రెండు రోజుల్లో ఫైనలైజ్ అయ్యి..ప్రకటన వస్తుందని చెప్తున్నారు. డిసెంబర్ లో మూఢం వెళ్లాక లాంచింగ్ ఉండనుంది.