Asianet News TeluguAsianet News Telugu

‘మహారాజ’ హిందీ రీమేక్ లో ఆ నటుడు, మాటలు జరుగుతున్నాయి?

 హిందీ ఓటిటి వెర్షన్ బ్లాక్ చేసేలా ఎగ్రిమెంట్ చేసుకుని రీమేక్ రైట్స్ తీసుకుంటారట. ఈ మేరకు బాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ రంగంలోకి దిగిందిట. 

Who Will act in Vijay Sethupathi tragic drama Maharaja Remake jsp
Author
First Published Jun 20, 2024, 5:06 PM IST


 విలక్షణ నటుడు యాక్టర్ విజయ్ సేతుపతి తన 50వ సినిమా 'మహారాజ'తో హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ రైట్స్ కు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే హిందీ రైట్స్ అమ్మటం వరకూ సమస్య లేదు కానీ అక్కడ విజయ్ సేతుపతిలా నటించేవారు ఎవరు అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది.   

తమిళ దర్శకుడు  నిథిలన్‌ ఈ సినిమాను థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్​ జానర్​లో తెరకెక్కించారు. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా  స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అన్ని వర్గాల ఆడియెన్స్​ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక హీరో విజయ్​కు ఇది 50వ సినిమా. ఇందులో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆయన నటనే సినిమాకు ప్లస్ పాయింట్ అని అంటున్నారు. అదే ఈ రీమేక్ చేసే విషయం దగ్గర సమస్యగా మారుంది. 

అయితే హిందీ నిర్మాతలు ఆల్రెడీ ఈ సినిమా ని అజయ్ దేవగన్ తో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో సినిమా చూడమని చెప్పారని తెలుస్తోంది. అజయ్ దేవగన్ కు నచ్చితే కనుక సినిమాని హిందీ ఓటిటి వెర్షన్ బ్లాక్ చేసేలా ఎగ్రిమెంట్ చేసుకుని రీమేక్ రైట్స్ తీసుకుంటారట. ఈ మేరకు బాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ రంగంలోకి దిగిందిట. ఇక అజయ్ దేవగన్ ఈ మధ్యన రీమేక్ లలో రచ్చ చేస్తున్నాడు. దృశ్యం, సైతాన్ రీమేక్ లు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. అజయ్ నో చెప్పితే అప్పుడు అక్షయ్ దగ్గరకు వెళ్తారట. 

చిత్రం కథేమిటంటే...

మ‌హారాజా (విజ‌య్ సేతుప‌తి) ఓ బార్బ‌ర్‌. ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకుంటాడు. అత‌నికంటూ మిగిలిన‌ ఒకే తోడు కూతురు జ్యోతి. త‌ను ఆ బిడ్డ‌తోనే క‌లిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. మ‌హారాజా ఓరోజు ఒంటి నిండా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్ గ‌డ‌ప తొక్కుతాడు.  ముగ్గురు ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని.. ఈ క్ర‌మంలోనే త‌మ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లిపోయార‌ని.. ఎలాగైనా స‌రే ఆ ల‌క్ష్మిని వెతికి పెట్ట‌మ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాడు.  మ‌రి మ‌హారాజా చెప్పిన ఆ ల‌క్ష్మి ఎవ‌రు?  అతని ఫిర్యాదును స్వీక‌రించ‌డానికి పోలీసులు తొలుత ఎందుకు నిరాకరించారు?  అస‌లు మ‌హారాజ‌పై దాడి చేసిన ముగ్గురు వ్య‌క్తులెవ‌రు?వాళ్లకు అత‌నికి ఉన్న విరోధం ఏంటి?  అన్న‌ది సినిమా చూసి తెలుసుకోవాలి.

కాగా, విజయ్ సేతుపతి  నటించిన ఈ 50వ సినిమా ట్రేడ్‌ మార్క్‌గా నిలిచిపోనుందని హీరోయిన్ కీర్తీ సురేశ్ రీసెంట్​గా ప్రశంసించారు. ఇక సినిమాలో విజయ్​తోపాటు అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, అభిరామి, నటరాజ్‌, భారతీరాజా, నటరాజ్, అరుళ్ దాస్, బాయ్స్ మణికందన్, వినోద్ సాగర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సుదాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి నిర్మించగా, అజనీశ్ లోక్​నాథ్ సంగీతం అందించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios