పడుకుంటేనే టాలీవుడ్ లో అవకాశాలు. అందుకే తెలుగమ్మాయిలకు అవకాశాలు రావు. ఎన్ని పక్కల కింద నలిగితే ఎన్ని సినిమాలు వస్తాయో నాకు తెలుసు. ఎందరు హిరోయిన్లు ఎవరెవరితో అవకాశం కోసం ఏమేం చేస్తున్నారో నాకు తెలుసు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసి సంచలనంగా మారిపోయిన టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి ఇంతకీ తెలుగమ్మాయేనా.. ఏంటామె కథ.

శ్రీ రెడ్డి.. గత వారం రోజులుగా తెలుగు ప్రజల్లో హాట్  టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో అవకాశాల కోసం నలిగి నలిగి విసిగి వేసారి.. తన గోడు వెళ్లబోసుకుంటూ.. తనలా మరే అమ్మాయి బలి కాకకూడదని కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా గళం విప్పింది శ్రీ రెడ్డి. శ్రీ రెడ్డి అసలు పేరు విమల. ఆంధ్ర ప్రదేశ్ లోని రెడ్ల కుటుంబంలో జన్మించింది. విమల మల్లెడి గా పుట్టిన శ్రీ రెడ్డి విద్యాభ్యాసం అంతా విజయావాడలోనే జరిగింది. తనది ఎంత సంప్రదాయ కుటుంబం అంటే.. ఇంట్లో పెదాలకు లిపిస్టిక్ పూసుకుంటే కూడా.. బోగం వేషాలు వేస్తున్నావా అంటూ తల్లి మందలించేంత. నెయిల్ పాలిష్ కూడా పెట్టుకోనివ్వని కుటుంబంలో పుట్టిన శ్రీ రెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేసి 2008లో ఉద్యోగం కోసం హైదరాబాద్ తరలి వచ్చింది. 

2009 మార్చిలో సాక్షి టీవీ యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించింది. అయితే.. అనతికాలంలోనే రంగుల ప్రపంచం ఆకట్టుకోవంతో.. టాలీవుడ్ వైపు అడుగులేసింది. సాక్షిలో తన తోటి యాంకర్లుగా వున్న అనసూయ, గాయత్రి తరహాలో తనుకూడా పరిశ్రమవైపు అడుగులేసింది శ్రీ లేఖ. ఏపీలో అనతికాలంలోనే హాట్ యాంకర్ గా... పొట్టి దుస్తులు, టాటూస్, హాట్ లుక్స్ తో..సాక్షి తో మంచి గుర్తింపు పొందిన శ్రీ రెడ్డి వెండితెరపై వెలిగేందుకు సాక్షికి రిజైన్ చేసి పరిశ్రమలోకి వచ్చేసింది. సాక్షి రిజైన్ చేసినప్పుడు అంతా షాకయ్యారు. కట్ చేస్తే.. హాట్ ఫోటోస్ నెట్టింట ప్రత్యక్షామయ్యాయి.
ఇంత అందంగా వున్న నువ్వు కేవలం బుల్లితెర యాంకర్ గా ఇలా మిగిలిపోవటం ఏంటని, వెండితెరను ఏలొచ్చని రెచ్చగొట్టడంతో.. ఫ్రెండ్స్ మాటలు నమ్మి వెండితెర అవకాశాల కోసం పరుగుపెట్టింది. అలా నేను నాన్న అబద్ధం చిత్రంలో నందు సరసన హిరోయిన్ గా నటించింది. 2011లో ఆ  మూవీ రిలీజైనా ఆడలేదు. 2013లో అరవింద్ 2 లో హిరోయిన్ గా అంగాంగ ప్రదర్శన చేసి నటిగా పేరు సంపాదించింది. గుర్తింపు పొందింది. ఇక అవకాశాలు తన్నుకొస్తాయననుకుంది. కానీ సరైన అవకాశాలు రాలేదు. దాంతో సినిమాల కార్యాలయాల చుట్టూ తిరిగి... ఒళ్లు వూనమయ్యేలా కష్ట పడింది. అలా ఎంతగా ప్రయత్నించినా..  తరువాత అవకాశాలు రాలేదు.
ఇక సెన్సేషన్ లకే సెన్సేషన్ గా మారిన శ్రీ రెడ్డి తాజాగా పోర్న్ సైట్లపైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు పోర్న్ సైట్లు, వేశ్యలను లేకుండా చేస్తే.. రేపిస్టులు తనలాంటి అమ్మాయిలపై ఎగబడితే ఎలా అంటూ.. సంచలన ప్రకటన చేసింది. ప్రతీ ప్రాంతంలో రెడ్ లైట్ ఏరియాలు పెడితే అమ్మాయిలపై వేధింపులు తగ్గుతాయని శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది. ఇలా నటిగా సరిగ్గా అవకాశాలు దక్కించుకోలేకపోయిన శ్రీ  రెడ్డి కి తన సంచలన వ్యాఖ్యలతో.. యాంకరింగ్ డోర్స్ కూడా క్లోజ్ అయాయి. 

ఎంతో కష్టపడ్డా అవకాశాలు దక్కట్లేదని... హిరోయిన్ ఛాన్స్ లు రాక, స్ట్రగుల్ చేసే ఓపిక లేకనే.. అరాచకాలు బైటికి చెప్పానని అంటోంది. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ నుంచి మోహన్ బాబు వరకు, నిర్మాత దిల్ రాజు నుంచి అల్లు అరవింద్ వరకు అందరిని వుతికి ఆరేసింది. తెలుగమ్మాయిలు పట్ల వీళ్లకు చులకన భావం ఎందుకో అర్థం కాదంది. ఇండస్ట్రీలో వున్న వాళ్లలో 99.9శాతం బ్రోకర్లేనని సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి.