నెక్ట్స్ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? కాంగ్రెస్ తో ఎవరికి మంచి అనుబంధం ఉంది!?
సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండుసార్లు సేవలందించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుండటంతో నెక్ట్స్ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కొన్ని విషయాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
2023 తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. రెండు పర్యాయాలు కేసీఆర్ కు మద్దతునిచ్చినవారు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. సెంట్రల్ తెలంగాణ లో మినహా ఉత్తర, దక్షిణ తెలంగాణలో ప్రజలు చేతిలో చేయివేశారు. నిన్న కౌంటింగ్ లో కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 39, బీజేపీ 8 స్థానాల్లో తమ జెండాలు పాతాయి. మొత్తానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయం సాధించారు.
ప్రస్తుతం తెలంగాణ సీఎం ఎవరనే దానిపై సీఎల్సీ మీటింగ్ లో ఏకపక్ష అభిప్రాయం జరిగింది. హైకమాండ్ నిర్ణయం కోసం అంతా వేచి ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డినే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రజలూ ఆయనే మద్దతు ఉండటం విశేషం. ఇక కొత్త ప్రభుత్వంలో క్యాబినేట్ మినిస్టర్ల ఎంపిక కూడా జరుగుతోంది. ఆయా శాఖల్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్లను చూస్తున్నారు. ఈ క్రమంలో నెక్ట్స్ సినిమాటోగ్రఫీ మంత్రి (Minister of cinematography) ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
సినీ ప్రముఖులు, సినిమా వాళ్ల కష్టాలను, సమస్యలను ఎవరికి చెప్పుకోబోతున్నామనేది రెండుమూడురోజుల్లో తేలనుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ తో సినిమా ఇండస్ట్రీలోని వీళ్లకు మంచి అనుబంధం ఉండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే బండ్ల గణేష్ (Bandla Ganesh) పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ నాయకుడిగా పలు మార్లు పోటీలో దిగారు. కొన్నాళ్లు గా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఈసారి బండ్లన్న పోటీ చేయలేదు. దీంతో ఆయనకు మంత్రివర్గంలో చోటుకు ఛాన్స్ లేదు. కానీ ఏపీలో అలీకి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా బాధ్యతలు అప్పగించారు. అలాగే బండ్ల గణేశ్ కూ అవకాశం ఉంటుందా? అనేది చూడాలి.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీపెద్దగా కొనసాగుతున్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలను రెండు తెలుగు ప్రభుత్వాలతో సున్నితంగా మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకూ కాంగ్రెస్ నేతలతో సన్నిహిత్యం ఉందని, మున్ముందూ మెగాస్టార్ సినీ సమస్యలపై మరింతగా పోరాడే అవకాశం ఉందంటున్నారు. ఇక సీఎం కేసీఆర్, కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas) సినీ ప్రముఖులకు అన్ని విషయాల్లో సహకరించారు. సినిమా షూటింగ్స్ కు పర్మిషన్లు, టికెట్ల రేట్ల విషయంలోనూ, సినీ కార్మికుల కోసమూ తమ వంతుగా సహకరిస్తూ వచ్చారు. దీంతో బీఆర్ఎస్ గెలవాలని టీవీ, సినీ సెలబ్రెటీలు ప్రచారం చేసిన విషయం కూడా తెలిసిందే.
ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ క్యాబినేట్ లో సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరనేది? ఆసక్తికరంగా మారింది. సినిమా వాళ్ల కష్టాలను, సమస్యలను ఎవరు పరిష్కరించబోతున్నారనేది? చూడాలి. రేవంత్ రెడ్డి ఇండస్ట్రీలోని పలువురితో మంచి అనుబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరి ఆ బాధ్యత వస్తుందనే చూడాలి. అలాగే కొన్నాళ్లు గా నంది అవార్డుల ప్రదానోత్సవం లేకపోవడం.. ఈ ప్రభుత్వంలోనైనా పున:ప్రారంభం అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుండటంతో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు. త్వరలో కాంగ్రెస్ నేతలను కలిసి శుభాకాంక్షలు తెలపనున్నట్టు చెప్పుకొచ్చారు.