లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు దళపతి విజయ్ తో లియో(Leo) సినిమా చేస్తున్నాడు.

హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా ప్రాజెక్టులు వరస పెట్టి చేసుకుంటూ పోతున్నారు. ఆయనతో సినిమా అంటే దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అలాగే పెద్ద డైరక్టర్స్ అందరూ ఆయనతో సినిమా చేయాలని ఉత్సాహపడుతున్నారు. అయితే ప్రభాస్ కు అంత ఖాళీ ఉందా..ఎప్పుడు చేయగలుగుతారు ఒప్పుకున్న సినిమాలు అన్ని అనేది ఎప్పుడూ పెద్ద ప్రశ్నే. ఇప్పటికీ ఓ ప్రక్కన నాగ్ అశ్విన్ తో కల్కి మూవీ చేస్తూ మారుతి డైరెక్షన్ లో ఒకటి, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ తో స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్ మూవీస్ చేస్తోన్నారు. ఈ లోగా ప్రభాస్ వీటితో పాటు మరిన్ని కొత్త కథలకు ఓకే చేస్తున్నారు. 

ఇక అసలు విషయానికి వస్తే గత కొద్ది రోజులుగా ప్రభాస్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు గాను చిన్న వయస్సులోనే హై సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదిగిన లోకేష్ కనకరాజ్ తో చేస్తున్నట్లు చెప్తున్నారు. విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj,)తో..ప్రభాస్ మూవీను చేస్తే మామూలు విషయం కాదు. అయితే నిజంగానే అది జరిగేందుకు అవకాసం ఉందా చూద్దాం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)వారు బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్, ప్రభాస్ కాంబో సెట్ చేసేందుకు ప్రయత్నం చేసారు. అయితే అవి కాలేదు. దాంతో వాళ్లే లోకేష్ కనగరాజ్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. అయితే లోకేష్ చెప్పిన కథ ప్రభాస్ కు నచ్చినా ఇప్పుడిప్పుడే చేసే పరిస్దితి లేదు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు దళపతి విజయ్ తో లియో(Leo) సినిమా చేస్తున్నాడు.

ఆ తర్వాత..రజినీకాంత్ తో లోకేష్ సినిమా మార్చిలో షూటింగ్ మొదలవుతుంది. ఈ లోపు స్క్రిప్ట్ పూర్తి చేసి, ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతారు. ఆ తర్వాత “ఖైదీ 2” స్టార్ట్ అవుతుంది. ఈ రెండూ పూర్తి అయ్యేసరికి 2025 వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రభాస్ తో చేయటానికి అవకాసం వస్తుంది. మరి అప్పటికి ప్రభాస్ మరికొంతమంది డైరక్టర్స్ తో సైన్ చేసి క్రేజీ ప్రాజెక్టులతో ముందుకు వెళ్లచ్చు...కాబట్టి ఇప్పుడిప్పుడే అయితే రెండేళ్ల దాకా ఈ కాంబో ఉండే అవకాసం లేదు అనేది ట్రేడ్ మాట.