‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న చిత్రం    'దేవర' . ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


టాలీవుడ్ లో నెక్ట్స్ పెద్ద సినిమాల్లో ఒకటి దేవర. ఈ సినిమాను ప్రకటించిన తేదీకు గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు షూటింగ్,ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని ఊహించని కారణాల వలన బ్రేకులు పడుతున్నప్పటికీ కొరటాలు మాత్రం వీలైనంతవరకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ తోనే వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. అయితే అనుకోని అవాంతరాలు మధ్యలో వస్తున్నాయి. విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడడం అలాగే కొన్ని షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తిగా కాకపోవడం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నుంచి పెద్ద అప్డేట్ ని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా తంగం అనే పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్బంగా సెట్ నుంచి వీడియో వదులుతారని భావించారు. కానీ కేవలం ఓ పోస్టర్ వదిలి సరిపెట్టారు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి తరహాలో తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న జాన్వి దేవరలో మాత్రం చాలా కీలకమైన పాత్రలోనే కనిపించబోతోందని అర్దమైంది. ఈ క్రమంలో అభిమానుల మొర ఆలకించి ఓ పెద్ద అప్డేట్ ని ఇవ్వమని టీమ్ ని ఎన్టీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న సాంగ్ టీజర్ రావచ్చు అని అలాగే ఓ కొత్త పోస్టర్ ని కూడా వదులుతారని తెలుస్తోంది. అయితే ఈ లోగా మాత్రం టీమ్ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వదుట. 

ఇదిలా ఉంటే దేవర సినిమా ఫస్ట్ పార్ట్ ని అక్టోబర్ 10న రిలీజ్ అవ్వచ్చని ప్రొడక్షన్ టీమ్ నుంచి హింట్స్ అందుతున్నాయి. అయితే పుష్ప 2 కనుక రిలీజ్ డేట్ మార్చుకుంటే కనుక ఆగస్ట్ 15 న రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న చిత్రం 'దేవర' .ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది. ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. ఇప్పటికే విడుదల చేసిన లుక్‌, గ్లింప్స్ లో చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెర్రోషియస్‌గా ఉంది. ఈ గ్లిప్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరియర్ లో దేవర బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్ కు ఓ రేంజిలో పోటీ నెలకొని ఉంది. అలాగే తాజాగా ఓవర్ సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం.

 ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.