Asianet News TeluguAsianet News Telugu

'అల వైకుంఠపురములో' సినిమాకు కరోనా ఎఫెక్ట్‌

పెద్ద పండగ అయ్యిపోయాక  సైతం అల వైకుంఠపురంలో నూరు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అల వైకుంఠపురం గ్లోబల్‌ థియేట్రికల్‌ హక్కులు రూ 85 కోట్లకు అమ్ముడుపోగా దాదాపు అందరూ లాభాల బాట పట్టారు. అలాగే ఓటీటి ప్లాట్ ఫామ్ లోనూ ఈ సినిమా రికార్డ్ లు నెలకొల్పింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా టీవి ప్రీమియర్ షోలలో కూడా దుమ్ము దులుపుతుందని అంచనా వేసారు. జెమినీ టీవి వారి దగ్గర ఈ సినిమా రైట్స్ ఉన్నాయి. జనం టీవీల్లో చూద్దామని వెయిట్ చేస్తున్నారు. అయితే అందుకు కరోనా అడ్డం పడుతోందని సమాచారం.

When will Ala Vaikunthapurramuloo TV premiere?
Author
Hyderabad, First Published May 13, 2020, 11:17 AM IST

'అల వైకుంఠపురములో' ..జనవరి 12న విడుదలైన ఈ సినిమా దర్బార్‌, సరిలేరు నీకెవ్వరు మూవీలతో తలపడుతూ దీటైన వసూళ్లను రాబట్టింది. పెద్ద పండగ అయ్యిపోయాక  సైతం అల వైకుంఠపురంలో నూరు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అల వైకుంఠపురం గ్లోబల్‌ థియేట్రికల్‌ హక్కులు రూ 85 కోట్లకు అమ్ముడుపోగా దాదాపు అందరూ లాభాల బాట పట్టారు. అలాగే ఓటీటి ప్లాట్ ఫామ్ లోనూ ఈ సినిమా రికార్డ్ లు నెలకొల్పింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా టీవి ప్రీమియర్ షోలలో కూడా దుమ్ము దులుపుతుందని అంచనా వేసారు. జెమినీ టీవి వారి దగ్గర ఈ సినిమా రైట్స్ ఉన్నాయి. జనం టీవీల్లో చూద్దామని వెయిట్ చేస్తున్నారు. అయితే అందుకు కరోనా అడ్డం పడుతోందని సమాచారం. 

ఇప్పటికే సరిలేరు నీకెవ్వరూ సినిమా ఆల్రెడీ రెండో టెలీకాస్ట్ కూడా అయ్యింది. ఈ నేపధ్యంలో అల వైకుంఠపురములో సినిమాని టెలీకాస్ట్ చేస్తారని ఆశించంటంలో వింతేమీ లేదు. అందులోనూ ఈ లాక్ డౌన్ టైమ్ లో టీఆర్పీలు బాగుంటాయి. సినిమాలు కూడా ఏమీ లేవు. వేసివేవే వేస్తున్నారు. ఇంతలా ఈ సినిమా టెలీకాస్ట్ కు మార్గం ఉన్నా...జెమినీ వారు కమర్షియల్ పర్పస్ లో ఈ సినిమాని ఇప్పుడు వేస్తే కనుక వర్కవుట్ కాదని భావిస్తున్నారట. ఎందుకంటే ఇప్పుడు టీవీల్లో యాడ్స్ తగ్గిపోయాయి. యాడ్స్ మార్కిటింగ్ రంగం కుదేలైంది. ఏ కంపెనీ వాళ్లు యాడ్స్ ఇవ్వటానికి ఉత్సాహం చూపడం లేదు. కేవలం సబ్బులు యాడ్స్ మాత్రమే వస్తున్నాయి. 

అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సీన్ లో ఉన్నప్పుడు యాడ్స్ కుమ్మేయాలి. ఇప్పుడా పరిస్దితి లేదు. దానికి తోడు భారీ మొత్తం పెట్టి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలంటే కొంతకాలం వెయిట్ చేసి, పరిస్దితులు చక్కబడ్డాక టెలీకాస్ట్ చేస్తే మంచిదని ఛానెల్ యాజమాన్యం భావిస్తోందిట. అలా పెద్ద సినిమాలు కొన్నిటిని ప్రక్కన పెట్టి యాడ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు మీడియా వర్గాల సమాచారం.  అయితే ఈ లోగా పైరసీ ద్వారా లేదా ఓటీటి ప్లాట్ ఫామ్ ద్వారా ఈ సినిమాని చూసేస్తే ..మళ్లీ టీవీల్లో వేసినప్పుడు చూసే జనం ఎంతమంది ఉంటారు. బాగా తగ్గుతారు. ఇదో మైనస్. అయినా సరే వెయిట్ చేద్దామనే ఫిక్స్ అయ్యారట. చూద్దాం మరి ఎప్పుడు ఈ సినిమాని టీవీల్లో వేస్తారో.
 

Follow Us:
Download App:
  • android
  • ios