బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నేడు తన 53వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. సుమారు 25 ఏళ్లుగా ఆయన సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. విదేశాల్లో సైతం ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అమీర్ ఖాన్ తండ్రి, బాబాయ్ లు నిర్మాతలు కావడంతో చిన్నప్పటి నుండే అమీర్ కి సినిమాలపై ఇష్టం ఏర్పడింది.

ఆ దిశగానే ప్రయత్నాలు చేసి హీరోగా సక్సెస్ అయ్యాడు. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ కారణంగా నటి దివ్యభారతి గంటలు తరబడి ఏడ్చిందట. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. అప్పట్లో దివ్యభారతి స్వయంగా అమీర్ కారణంగా ఇబ్బంది పడిన విషయాన్ని మీడియా ముందు తెలిపింది.

లండన్ లో ఓ షో నిర్వహిస్తోన్న నేపధ్యంలో దివ్యభారతి చేసిన పనికి అమీర్ ఖాన్ ని కోపం వచ్చిందట. దీంతో ఆమె బాత్రూంలోకి వెళ్లి గంటల తరబడి ఏడ్చారట. అమీర్ ని క్షమాపణలు కోరినా.. అతడు మాత్రం దివ్యభారతితో షో చేయడానికి అంగీకరించలేదట. హీరోయిన్ జూహిచావ్లాతో ప్రదర్శనలో పాల్గొంటానని నిర్వాహకులకు తెలిపారట.

అప్పుడు దివ్యభారతికి హీరో సల్మాన్ మద్దతు పలుకుతూ  ఆమెతో పాటు ప్రదర్శనలో పాల్గొన్నారట. అమీర్ ఖాన్ స్టార్ ఆటిట్యూడ్ కారణంగా బాగా అప్సెట్ అయ్యానని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది దివ్యభారతి.