కొత్త పెళ్లికూతురు నిహారిక నేడు మరొక వేడుక జరుపుకుంటున్నారు. పెళ్ళైన తరువాత మొదటి బర్త్ డే భర్త చైతన్యతో నిహారిక సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 1993 డిసెంబర్ 18న జన్మించిన నిహారిక నేడు తన 27ఏట అడుగుపెట్టారు. మెగా ఫ్యామిలీలో నిహారిక గట్స్ ఉన్న ఇండిపెండెంట్ అమ్మాయి అనాలి. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా మారిన ఏకైక అమ్మాయి నిహారిక కావడం విశేషం. నటిగా, వ్యాఖ్యాతగా మరియు నిర్మాతగా కూడా నిహారిక వ్యవహరించడం జరిగింది.హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే నిహారిక ఢీ డాన్స్ రియాలిటీ షోకి యాంకర్ గా చేశారు. 
 
ఆ తరువాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా మారడం జరిగింది. సినిమాపై మక్కువతో హీరోయిన్ అవుతానంటే తండ్రి నాగబాబుతో పాటు కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారట. అందరినీ ఒప్పించి నిహారిక హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కావడం జరిగింది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలలో నిహారిక హీరోయిన్ గా చేశారు. ఓ తమిళ చిత్రంలో కూడా నిహారిక హీరోయిన్ గా నటించారు. అలాగే నిర్మాతగా నాన్న కూచి, మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ లు నిర్మించారు. 
 
ఐతే చదువు అయిపోయిన వెంటనే నిహారిక ఓ కాఫీ షాప్ లో పనిచేశారట. అందుకు తనకు జీతంగా వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవారట. అది తన మొదటి సంపాదన అని నిహారిక పలు సందర్భాలలో చెప్పారు. వివిధ వ్యక్తుల మనస్తత్వాలు, కల్చర్స్ తెలుసుకోవడానికి తాను ఆ పని చేశానని నిహారిక చెప్పారు. ఇక చిరంజీవి హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ సైరాలో నిహారిక గెస్ట్ రోల్ చేశారు. అంతకు ముందే అంజి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నిహారిక నటించారట. అయితే కథలో కొన్ని మార్పుల కారణంగా తన పాత్రను మరలా, వేరే అమ్మాయితో చేయించారని నిహారిక చెప్పారు.