విజయ్ దేవరకొండ హీరోగా .. భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'గీత గోవిందం' తరువాత విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటిస్తోన్న సినిమా ఇది కావటంతో ప్రాజెక్టుపై మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా .. రష్మిక క్రికెటర్ గా కనిపించనుంది. 

ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ డీల్ ని చాలా జాగ్రత్తగా చేస్తారు. కంగారుపడి క్లోజ్ చేయరు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమా బిజినెస్ ని చాలా స్పీడుగా క్లోజ్ చేసినట్లు సమాచారం. అలాగే అదే బ్యానర్ లో వస్తున్న చిత్రలహరి సినిమా బిజినెస్ కూడా ఎక్కువ బేరసారాలు లేకుండా ముగించారట. ఇలా చేయటం వెనక ఓ చిత్రమైన కారణం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

మైత్రీమూవీస్ లో ఓ సిట్టింగ్ ఎమ్మల్యే పెట్టుబడి పెట్టారని మీడియాలో వార్తలు వస్తున్నాయి . ఆయన మళ్లీ ఎలక్షన్స్ లో సీట్ తెచ్చుకున్నాడని, ఆ ఎలక్షన్ ఖర్చుల నిమిత్తం...తన వాటా డబ్బు కావాలని అడిగారని ప్రచారం జరుగుతోంది. దాంతో వేరే దారిలేక డియర్ కామ్రేడ్, చిత్రలహరి సినిమాలు బిజినెస్ హడావిడిగా ముగించి, ఆ డబ్బు ని ట్రాన్సఫర్ చేసారని వినికిడి. ఇప్పుడా డబ్బు ఎలక్షన్స్ పెట్టుబడిగా మారుతుందంటున్నారు. అయితే ఇది కేవలం రూమరేనా, లేక నిజమా అనేది తేలాల్సి ఉంది. అయితే ఇది కావాలని పుట్టించిన రూమర్ అని కొందరంటున్నారు. 

డియర్ కామ్రేడ్ చిత్రాన్ని భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి జైకృష్ణ మాటలు రాస్తున్నారు. 

రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరామెన్: సుజిత్ సరంగ్, ఎడిటర్: శ్రీజిత్ సరంగ్, డైలాగ్స్: జైకుమార్, బ్యానర్స్: మైత్రి మూవీమేకర్, బిగ్‌బెన్ సినిమాస్ నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చిరుకూరి (సి.వి.ఎం), యస్.రంగినేని.